దాదాపు అన్ని పెద్ద దేశాలూ ఉపగ్రహ ప్రయోగాలను తెగ చేస్తున్నాయి. ఈ ప్రయోగాల వలన చాలా ఉపయోగమే ఉంది కానీ...అవి బోలెడు వ్యర్ధాలను తీసుకుని వెళ్ళి అంతరిక్షంలో వదిలేస్తున్నాయి. అదీకాక కొన్ని ఉపగ్రహాలు కొన్నేళ్ళు మాత్రమే పని చేస్తాయి. దాని తర్వాత వాటి ఉపయోగం ఉండదు. అప్పుడు ఆ ఉపగ్రాహాలను వెనక్కు తీసుకురావడం కదరు. అందుకే వాటిని అక్కడే డిస్ట్రాయ్ చేస్తారు. అప్పుడు దాని తాలూకా వ్యర్ధాలు, ఉపగ్రహం లోహాలు లాంటవి అంతరిక్షంలో ఉండిపోతున్నాయి. అవి అన్నీ భూకక్ష్య చుట్టూనే తిరుగుతూ ఉంటున్నాయి. దీని వలన భూమి చుట్టూ వ్యర్ధాలతో ఒక పొరలా ఏర్పడుతోంది. ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో 14,000 ఉపగ్రహాలు సంచరిస్తుండగా.. వీటిల్లో 3,500 నిరుపయోగంగా మారాయి. వీటి ప్రయోగాల కారణంగా తయారైన 12 కోట్ల రాకెట్ శకలాలు కూడా స్పేలోనే ఉండిపోయయని..అమెరికాకు చెందిన స్లింగ్‌షాట్ ఏరోస్పేస్ గణంకాలు చెబుతున్నాయి. వీటిల్లో కొన్ని ట్రక్కు సైజులోవి కూడా ఉన్నట్లు తెలిపింది.
భూమి చుట్టూ ఉండే క్ష్య మనకు చాలా ముఖ్యమైనది. దాని ద్వారానే అన్ని ప్రయోగాలు జరుగుతాయి. భూమి కూడా సురక్షితంగా ఉండాలంటే కక్ష్య శుభ్రంగా ఉండాలి. దిగువ కక్ష్యను జాగ్రత్తగా వినియోగించుకోవడానికి తక్షణ చర్యలు అవసరమని అంతరిక్ష రద్దీ సమన్వయంపై ఏర్పాటు చేసిన ఐరాస ప్యానల్ అక్టోబర్‌లోనే చెప్పింది. భూకక్ష్యలో వ్యర్ధాల వలన ఉపగ్రహాలు ఢీకొనడాన్ని నిరోధించేందుకు వాటిని నిర్వహించే ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల్సిందేనని ఐరాస ప్యానెల్ సహ అధ్యక్షురాలిగా ఉన్న ఆర్తి హోల్లా మైని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నేవిగేషన్, కమ్యూనికేషన్‌లకు తీవ్ర అంతరాయాలు రాకుండా ఉండాలంటే దిగువ భూకక్ష్య సురక్షితంగా మారాలి అన్నారు.
రూల్స్ పెట్టాల్సిందే..
భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్ళనున్నాయి. దీంతో ఇవి పరస్పరం ఢీకొనే ముప్పు బాగా పెరిగిపోయింది. ఫలితంగా రానున్న ఐదేళ్లలో నష్టాల విలువ రూ.4 వేల కోట్లకు పైగా ఉంటుందని మాంట్రియాల్‌లోని నార్త్‌స్టార్ ఎర్త్ అండ్ స్పేస్ సంస్థ లెక్కగట్టింది. ప్రస్తుతం అంతరిక్షాన్ని వినియోగించుకోవడం, పర్యవేక్షించడానికి నియమ నిబంధనల ఏర్పాటు సంక్లిష్టంగా ఉంది. స్టార్ లింక్ ఇప్పటికే వేల ఉపగ్రహాలను ప్రయోగించింది. మరోవైపు చైనా కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమైంది. దానికి తోడు ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలు చేయగల సామర్థ్యం ఉన్న దేశాలను సమన్వయం చేసేందుకు ఎటువంటి వ్యవస్థ లేదు. దాదాపు అన్ని దేశాలు తమ ఉపగ్రహాల డేటాను భద్రతా కారణాలతో పంచుకోవడానికి సిద్ధంగా లేవు. ముఖ్యంగా పౌర-సైనిక ప్రయోజనాలకు వాడే ఉపగ్రహాల విషయంలో ఈ సమస్య తలెత్తుతోంది. ఇక వాణిజ్య సంస్థలు తమ రహస్యాలు రక్షణ ఉండవని ఈ రకమైన చర్యలకు ఇష్టపడడం లేదని ఆర్తి చెబుతున్నారు.
ఈఏడాది నవంబర్ 27 నాటికి భూమి ఉపరితలం నుంచి 540-570 కిలోమీటర్ల ఎత్తులో స్టార్‌లింక్‌కు చెందిన 6,764 శాటిలైట్స్ స్పేస్‌లో ఉన్నాయి. ఇవి 2024 మొదటి హాఫ్ ఇయర్‌లో 50వేల సార్లు ఢీకొనడాన్ని తప్పించుకొనేలా గమనాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ముందు ముందు ఇలాంటి పరిస్థితి అన్ని దేశాల ఉపగ్రహాలకూ వస్తుంది. అందుకే ఇప్పటి నుంచి దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని ఐరాస ప్యానెల్ సూచిస్తోంది.
Also Read: Water: హైరిస్క్ కేటగిరీలో మినరల్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్