Iran-Israel war: యుద్ధం చమురు కోసం కాదు.. మంచినీళ్లే టార్గెట్‌గా మూడో ప్రపంచ యుద్ధం!

గల్ఫ్ దేశాల బలహీనతను దెబ్బతీసేందుకు శత్రు దేశాలు అక్కడి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం నీటి కోసమే వస్తుందన్న నిపుణుల హెచ్చరికలు నిజమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

New Update
Drinking water resources

పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు భయంకరమైన కొత్త మలుపు తిరిగింది. నిన్నటి వరకు చమురు నిల్వలే యుద్ధ లక్ష్యాలు అనుకుంటే, ఇప్పుడు ఆ స్థానాన్ని 'తాగునీరు' ఆక్రమించింది. గల్ఫ్ దేశాల బలహీనతను దెబ్బతీసేందుకు శత్రు దేశాలు అక్కడి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం నీటి కోసమే వస్తుందన్న నిపుణుల హెచ్చరికలు నిజమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి భద్రతను జాతీయ భద్రతగా చూడాల్సిన అవసరం ఏర్పడింది. నీటి వనరులపై దాడులు చేయడంతో కేవలం సైన్యంపైనే కాకుండా, సామాన్య పౌరుల మనుగడపై తీవ్ర ప్రభావం పడుతోంది. పశ్చిమాసియాలో నీటి చుట్టూ తిరుగుతున్న ఈ యుద్ధం ప్రపంచానికి ఒక హెచ్చరికగా మారింది.

గల్ఫ్ బలహీనత

గల్ఫ్ దేశాలకు చమురు ఎంత బలమో, నీరు అంత పెద్ద బలహీనత. ఎడారి వాతావరణం కారణంగా ఇక్కడ సహజ సిద్ధమైన మంచినీటి వనరులు తక్కువ. దీంతో సముద్రపు ఉప్పు నీటిని శుద్ధి చేసి మంచినీరుగా మార్చే 'డీసాలినేషన్' ప్లాంట్లపై ఈ దేశాలు అత్యధికంగా ఆధారపడుతున్నాయి. ప్రపంచంలోని 60 శాతం నీటి శుద్ధి యూనిట్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.

కువైట్, యుఏఈ: 90% తాగునీరు ఈ ప్లాంట్ల నుంచే వస్తుంది.
ఒమాన్: 86% వాటా.
బహ్రెయిన్: 80% ఆధారపడటం.
సౌదీ అరేబియా, ఖతార్: 70% అవసరాలు వీటి ద్వారానే తీరుతున్నాయి.

ప్రజలను ఇక్కట్లలోకి నెట్టడం యుద్ధ వ్యూహం -
ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరుపక్షాలు నీటి మౌలిక సదుపాయాలపై దాడులు పెంచాయి. తమ నీటి ప్లాంట్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు చేశాయని ఇరాన్ ఆరోపించగా, తమ ప్లాంట్‌పై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ వెల్లడించింది. ఒకవేళ ప్రధాన ప్లాంట్ దెబ్బతింటే, కేవలం కొన్ని రోజుల్లోనే ఆయా దేశాల రాజధానులను ఖాళీ చేయాల్సి వస్తుందని అమెరికా నిఘా నివేదికలు హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇరాన్‌కు ముప్పు తక్కువేనా?

గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఇరాన్‌కు నీటి ముప్పు కొంత తక్కువ. ఎందుకంటే ఇరాన్ ప్రధానంగా డ్యామ్‌లు, భూగర్భ జలాల మీద ఆధారపడుతుంది. తీరప్రాంత ప్లాంట్లపై దాడులు జరిగినా ఇరాన్ తట్టుకోగలదు. కానీ మిగిలిన అరబ్ దేశాలకు ఇది ప్రాణాంతక సమస్య. నీటి సరఫరా ఆగితే ఆహార సంక్షోభం కూడా ముదురుతుంది, ఎందుకంటే గల్ఫ్ దేశాలు 80-90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి.

Advertisment
తాజా కథనాలు