Trump Grand Victory:
అమెరికాలో రిపబ్లికన్ల సంబరాలు మిన్నంటాయి. ఫ్లోరిడా రాష్ట్రం మొత్తం పండగ చేసుకుంటోంది. అటు వాషింగ్టన్‌లో వైట్ హౌస్ దగ్గర కూడా సందడి నెలకొంది. ట్రంప్ అయితే సంతోషంతో గెంతులేస్తున్నారనే చెప్పవచ్చును. నిన్న రాత్రి నుచి ఆయన ఫామ్ హైస్ దగ్గర సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అది కాక ఫ్లోరిడాలో మాస్ ర్యాలీ కూడా నిర్వహించారు ట్రంప్. ఈ విజయం ఊహించినదే అని...ముందు నుంచి తానే విజయం సాధిస్తానని చెబుతున్నానని అన్నారు ట్రంప్. ర్యాలీలో తన మూడవ భార్య మెలానియా ను ముద్దులతో ముంచెత్తారు కూడా.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 2024 US పోల్స్‌లో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై గ్రాండ్ విక్టరీ సాధించారనే చెప్పాలి. ట్రంప్ 277 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో మెజారిటీ సాధించారు. ఇంకా కొన్నిచోట్ల కౌంటింగ్ జరుగుతూనే ఉంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి ముఖ్యమైన ఏడు స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ విజయ దుందుభి మోగించారు. ఇప్పటివరకు అన్ని చోట్లా 85 శాతం కౌంటింగ్ పూర్తయింది. ఇందులో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. నాలిగింటిలో ఇప్పటివరకు ఫలతాలను అనౌనస్ చేశారు. మరో మూడింటిలో 52 శాతం మెజారిటీతో ట్రంప్ ముందంజలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన వియం ఖరారు అయిపోయింది. గత ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ కేవలం ఆరు స్వింగ్ రాష్ట్రాల్లోనే విజయం సాధించారు. కానీ ఈసార ట్రంప్ ఏడింటిలోనూ గెలుపు జెండా పాతేశారు.
ప్రచారం జరుగుతున్నప్పుడు...తర్వాత వచ్చిన సర్వేలు అన్నింటిలో ...పోల్ ఎగ్జిట్‌లో కూడా కమలా హారిస్ గెలుస్తుందని వచ్చింది. కౌంటింగ్ మొదలైనంత వరకు కూడా గాలి కమలా హారిస్ వైపే ఉంది. కానీ కౌంటింగ్ మొదలైన కాసేటికే మొత్తం ట్రంప్ వైపు తిరిగిపోయింది. ఫలితాల విడుదలలో ట్రంప్ మొదటి నుంచి ధిక్యం కనబరుస్తూనే వచ్చారు. మధ్యలో కాసేపు కమలా హారిస్ దూకుడుఎరిగినట్టు కనిపించినా...అది ఎంతో సేపు నిలబడలేదు. మళ్ళీ ట్రంప్అధిక్యలోకి వచ్చేశారు. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్‌లో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాను ట్రంప్ చేజిక్కుంచుకున్నారు. దానికి తోడు డెమోక్రాట్ల కంచుకోట అయిన విస్కాన్సిస్ కూడా రిపబ్లికన్ల పరం అయింది. దీంతో ట్రంప్ విజయం ఖాయం అయిపోయింది.
Also Read: అరుదైన రికార్డుకు చేరువలో అర్ష్‌దీప్.. భువీ రికార్డు బద్దలు కొడతాడా!