Trump: భారతీయులకు భారీ షాకిచ్చిన ట్రంప్.. వారి పౌరసత్వం రద్దు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిరాగానే భారతీయుకు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్స్ పిల్లలకు ఆటోమేటిక్‌ పౌరసత్వం రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది నిజమైతే 10 లక్షల మంది భారతీయులపై ఎఫెక్ట్ పడనుంది.

New Update

America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిరాగానే భారతీయుకు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్స్ పిల్లలకు ఆటోమేటిక్‌ పౌరసత్వం రద్దు చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నూతన అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనుండగా.. అధికారం చేపట్టే రోజే ఈ ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు చర్చ నడుస్తోంది. ఇది గనుక నిజమైతే 10 లక్షల మంది భారతీయులపై ఎఫెక్ట్ పడనుంది. 

 

ఒక్కరోజు ముందు పుట్టినా వారికే..

ఇక కొత్త రూల్స్ ప్రకారం.. ఆటోమేటిక్ పౌరసత్వం రావాలంటే పేరెంట్స్‌లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరుడు లేదా గ్రీన్‌ కార్డు హోల్డర్ అయి ఉండాలి. కానీ ఈ నిర్ణయం US రాజ్యాంగానికి విరుద్ధమని న్యాయవాదులు చెబుతున్నారు. అమెరికాలో దాదాపు 48 లక్షల మంది భారతీయ అమెరికన్ల నివాసం ఉంటుండగా.. వీరిలో 16 లక్షల మంది అమెరికాలో జన్మించిన వారే కావడం గమనర్హం. ఇక ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఒక్కరోజు ముందు పుట్టినా వారికే ఆటోమేటిక్ పౌరసత్వం వర్తస్తుందని, ప్రమాణస్వీకారం తర్వాత పుడితే ఆటోమేటిక్ పౌరసత్వం రాదని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుండగా.. ఇండో అమెరికన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

 

#america #donald-trump #indians
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe