H-1B visa: హెచ్‌-1బీ వీసాలో మార్పులు.. పాత రికార్డులన్నీ తొలగింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌-1బీ వీసా జారీ విషయంలో కొత్త వ్యవస్థ అమలుపై దృష్టి పెట్టారు. నేటి నుంచి ఐదేళ్ల కంటే పాతవైన రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. పాత వీసాల రికార్డులను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశించారు.

New Update
VISA

H 1 B VISA Photograph: (H 1 B VISA)

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వీసా జారీ ప్రక్రియలో కొత్త వ్యవస్థను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీసా దరఖాస్తులను పరిశీలించే  ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే వ్యవస్థలో ఉన్న పాత రికార్డులు, దరఖాస్తులను తొలగించనుంది.

ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

పాత వీసాల రికార్డులు అన్నింటిని..

ఐదేళ్ల కంటే పాతవైన రికార్డులను సిస్టమ్ నుంచి నేటి నుంచి తొలగించనున్నారు. అంటే ఉదాహరణకు నేటి తేదీ నుంచి గతంలో ఐదేళ్ల వరకు ఉన్న పాత రికార్డులను తొలగిస్తారు. ఈ పాత వీసాల రికార్డులు అన్నింటిని కూడా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలని ఇప్పటికే కొన్ని సంస్థలకు ఆదేశించారు. డౌన్‌లోడ్ చేసి పెట్టుకోకపోతే మాత్రం తప్పకుండా ఆ రికార్డులను కోల్పోవలసి వస్తుందని తెలిపింది. హెచ్‌-1బీ సహా అన్ని తాత్కాలిక లేబర్‌ కండిషన్‌ అప్లికేషన్స్‌, శాశ్వత లేబర్‌ సర్టిఫికేట్‌ అఫ్లికేషన్లపై కూడా ఈ తొలగింపు ఉంటుందని ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ విభాగం నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

వీసాల జారీ కోసం యూఎస్‌ ఇమిగ్రేషన్‌ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ సర్కారు వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు