Donald Trump:
2020 ఎలక్షన్ల తర్వాత ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి ఎన్నికల ప్రక్రియలో అవకతకలు చోటు చేసుకున్నాయని అన్నారు. తన తరుఫున చాలా రాష్ట్రాల్లో లాయర్లతో పిటిషన్లు కూడా వేయించారు కూడా. అయితే తరువాతి కాలంలో సాక్ష్యాలు లేకపోవడంతో వాటిని తిస్కరించారు. ఇప్పుడు వాఇని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఈసారి ఎలక్షన్ల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం 5 వేలమంది లాయర్లను నియమించుకున్నారని చెబుతున్నారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడం, అవకతవకలపై ప్రతిస్పందనలను సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియను ఈ లాయర్లు దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఒకవేళ ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు వ్యతిరేకంగా వస్తే...వెంటనే కోర్టులో సవాల్ చేసేందుకు ఈ లాయర్లు అంతా రెడీ గా ఉంటారు.
ఇక అమెరికా ఎన్నికల విషయానికి వస్తే ఈ సారి ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. చివర వరకూ ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టంగా మారింది. నిన్నటి వరకూ ట్రంప్ ఆధిక్యంలో ఉంటే...ఈరోజు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఒక్కసారి కమలా హారిస్ పైకి వచ్చేశారు. ప్రస్తుతం కమలా హారిసే అధ్యక్ష పీఠం ఎక్కుతారని సర్వలు చెబుతున్నాయి. అయితే మరికొన్ని గంటల్లో ఎవరు గెలిచారన్నది క్లియర్‌గా తెలిసిపోతుంది.
Also Read: USA: అమెరికాలో మొదలైన పోలింగ్.. రాష్ట్రాల వారీగా టైమింగ్స్