USA: అమెరికాలో మొదలైన పోలింగ్.. రాష్ట్రాల వారీగా టైమింగ్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇప్పటికే చాలాశాతం ఓటింగ్ నమోదైంది. ఈరోజు ఫైనల్ ఇన్ పర్శన్ పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఆరు గంటల నుంచే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. By Manogna alamuru 05 Nov 2024 | నవీకరించబడింది పై 05 Nov 2024 19:15 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి USA Election Polling: ప్రపంచం దృష్టి అంతా ఇప్పుడు అమెరికా ఎన్నికలపైనే ఉంది ఈరోజు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫైనల్ పోలింగ్ దేశమంతా జరుగుతోంది. గత కన్ని రోజుల క్రితమే ఈ ప్రక్రియ మొదలైపోయింది. ఈమెయిల్స్ ద్వారా, ఇన్ పర్శన్‌గా కూడా నిన్నటికి 7.5 శాతం ఓటంగ్ నమోదైంది. మొత్తం అఎరికాఓ 24.4 కోట్ల టర్లు ఉన్నారు. కాగా ఈరోజు మిగిన వాళ్ళందరూ ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం ఆరు నుంచి కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, మైన్, న్యూహ్యాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా రాష్ట్రాల్లో ఆరు గంటలకే స్టార్ చేసేశారు. ఇక ఒహాయో, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, వెర్మాంట్‌లలో 6.30 గంటలకు...అలబామా, డెలవేర్, వాషింగ్టన్ డీసీ, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినోయీ, కాన్సస్, మేరీల్యాండ్, మసాచుసెట్స్, మిషిగన్, మిస్సోరి, పెన్సిల్వేనియా, రోడ్ ఐల్యాండ్, సౌత్ కరోలినా, టెన్నెసీ, ఆర్క్సా రాష్ట్రాల్లో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఆరిజోనా, అయోవా, లూసియానా, మిన్నెసోటా, సౌత్ డకోటా, నార్త్ డకోటా, ఓక్లహోమా, టెక్సాస్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో మాత్రం మరికాసేపట్లో అంటే యూఎస్ టైమింగ్స్ ప్రకారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి ఫలితం వచ్చేసింది.. ఇక న్యూ హ్యాంప్‌షైర్లో నిన్న అర్ధరాత్రి నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలైపోయింది. అమెరికాలో అన్నింటికంటే ముందుగా ఇక్కడి డిక్స్ విల్లే నాచ్‌లో పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ కేవలం ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో పోలింగ్ అయిన వెంటనే కౌంటింగ్ కూడా చేసేసి ఫలితాలను రిలీజ్ చేసేసారు. మొత్తం ఆరు ఓట్లలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మూడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మూడు ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడ డెమోక్రటిక్ అభ్యర్ధి గెలిచారు. Also Read: వచ్చే ఏడాది రియలన్స్ జియో ఐపీఓ..112 బిలియన్ డాలర్ల సేకరణ లక్ష్యం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి