USA: మెలానీయాతో కలిసి ఓటేసిన ట్రంప్..కాలిఫోర్నియాలో కమలా ఓటు

రిపబ్లిక్ పార్టీ అభ్యర్ధి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య మెలానియా తో కలిపి ఆయన ఓటు వేయడానికి వచ్చారు. ఈ ఎన్నికల్లో తానే కచ్చితంగా గెలుస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. 

11
New Update

USA Elections: 

మేక్ అమెరికా బ్రైట్ ఎగైన్ అనే నినాదం రాసి ఉన్న టోపీతో కొద్దిసేపటి క్రితం ఓటేశారు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్. మేక్ అమెరికా బ్రైట్ ఎగైన్...ఇది రిపబ్లికన్ల ఎన్నికల నినాదం. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని పోలంగ్ కేంద్రంలో తన భార్య మెలానియాతో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ట్రంప్. సంప్రదాయవాదులు, రిపబ్లికన్లు ఓటు వేసేందుకు పెద్దఎత్తున బారులు తీరడం గౌరవంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.  ఎన్నికల ఫలితాల క్రమంలో హింసాత్మక ఘటనలు జరగకూడదని మీ మద్దతుదారులకు చెబుతున్నారా? అని అడిగిన ప్రశ్నకు.. వారికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హింస ఉండదు. నా మద్దతుదారులు హింసాత్మక వ్యక్తులు కాదు అని ఆయన సమాధానం చెప్పారు. 


ఇక డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తన సొంత రాష్ట్రమైన కాలిఫోర్నియాలో ఓటు వేశారు. ఈమె తన ఓటును మెయిల్ ద్వారా వేశారు. అలాగే రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌.. ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటిలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ఇక అమెరికాలో దేశ వ్యాప్తంగా పోలింగ్ చురుగ్గా జరుగుతోంది. దీని కోసం అని కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళు, కాలేజీలు, కంపెనీలకు సెలవు కూడా ఇచ్చారు. వాషింగట్‌, మేరీ లాండ్ లాంటి ప్రదేశాల్లో నిన్న , ఇవాళ సెలవు దినాలుగా ప్రకటించారు. మరోవైపు అమెరికన్లు తన ఓటు హ్ను వినియోగించుకుంటున్నారు. ఓటేసేందుకు ఉత్సాహంగా పోలింగ్ బూతులకు తరలి వస్తున్నారు. 

Also Read: Ap:వీడియో విడుదల చేసిన విజయమ్మ.. కుటుంబ తగాదాలపై సంచలన ప్రకటన!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe