Ap:వీడియో విడుదల చేసిన విజయమ్మ.. కుటుంబ తగాదాలపై సంచలన ప్రకటన! తమ కుటుంబంపై వచ్చిన అసత్య ప్రచారాలకు వైఎస్ విజయమ్మ కొద్దిసేపటి క్రితం కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్ఆరని ఆమె మండిపడ్డారు. డిగ్నిఫైడ్‌గా రాజకీయాలను చేయాలని విజయమ్మ కోరారు. By Manogna alamuru 05 Nov 2024 | నవీకరించబడింది పై 05 Nov 2024 23:25 IST in కడప టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి YS Vijayamma: తమ కుటుంబంతో ఎవరు పడితే వారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కారు ప్రమాదంతో తన హత్యకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్ర పన్నాడని జరుగుతున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఖండించారు. దీని మీద ఇంతకు ముందే లేఖరాసినా...దాన్ని కూడా అసత్యమని ప్రచారం చేసతున్నారని వాపోయారు. కుటుంబం అన్నాక భేదాభిప్రాయాలు ఉంటాయని కానీ హత్య చేసుకునేంత లేదని.. తన పిల్లలను ఎంతో సంస్కారవంతంగా పెంచానని విజయమ్మ తెలిపారు. తమ కుటుంబ వివాదాలపై బయట జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై తప్పుడు వార్తలు రాసే వారిని వదిలిపెట్టనని.. న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. తమ పిల్లలను తాము ఎంతో సంస్కారవంతంగా పెంచామని చెప్పుకొచ్చారు. రెండేళ్ల కిందట కర్నూలులో విజయమ్మ కారు ప్రమాదానికి గురయితే అది జగన్ హత్య చేసేందుకు పన్నిన కుట్ర అని టీడీపీ అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై సోమవారం విజయమ్మ లేఖ విడుదల చేయగా.. ఆ లేఖను టీడీపీ ఫేక్ అని ప్రకటించింది. జగన్ తప్పుడు లేఖలు సృష్టిస్తున్నాడని ప్రచారం చేసింది. దీంతో విజయమ్మ డైరెక్ట్‌గా రంగంగలోకి దిగి వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. రాజకీయాల కోసం ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయడం సరికాదని ఆమె అన్నారు. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తన కొడుకుతో పెట్టుకోవాలని సూచించారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను చేయోద్దని...దీని తరువాత కూడా వీటిని ఆపకపోతే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని విజయమ్మ హెచ్చరించారు. సోషల్ మీడియాలో ప్రచారానికి కౌంటర్ ఇచ్చిన విజయమ్మ. కుటుంబంలో తగాదాలు ఉన్నంత మాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా. అన్నకి చెల్లి కాకుండా పోతుందా. - విజయమ్మ pic.twitter.com/0pf3Ny8AYw — The RajaSaab (@PardhuDesigns) November 5, 2024 ఇది కూడా చదవండి: AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి