Batti vikramarka: భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. సెప్టెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశాలకు ఆహ్వానం అందింది. ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. By srinivas 15 Sep 2024 in ఇంటర్నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి Batti vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశాలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. 'ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ 200వ వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తాం' అని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. #telangana #batti-vikramarka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి