Bharat: ఇండియా-కెనడా యుద్ధం.. మధ్యలో బిష్ణోయ్.. వివాదానికి కారణమేంటి?

కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులను టార్గెట్ చేయడానికి భారత్‌ ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తోందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. తాజాగా ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్టే అర్థమవుతోంది.

bishnoye
New Update

Bharat : 'కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులను టార్గెట్ చేయడానికి భారత్‌ ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తోంది..' ఇది కెనడా ప్రభుత్వం ఇండియాపై చేస్తున్న అతిపెద్ద ఆరోపణ.. ఖలిస్థానీ వేర్పాటువాద నేత నిజ్జర హత్య తర్వాత నుంచి భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక తాజాగా ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్టే అర్థమవుతోంది. ఎందుకంటే కెనడా డిప్యూటీ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్‌ విడిచి వెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  అటు కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలను వెంటనే వెనక్కి రావాల్సిందిగా చెప్పింది. ఇదే సమయంలో కెనడా ప్రధాని మరోసారి లారెన్స్‌ బిష్షోయ్‌ మాట ఎత్తడం అగ్నికి ఆజ్యంపోసినట్టుగా మారింది.

సిద్ధిక్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్...

ఇటీవల హత్యకు గురైన NCP నేత, సల్మాన్ ఖాన్‌ ఫ్రెండ్‌ బాబా సిద్ధిక్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆధారాలు దొరికిన సమయంలోనే కెనడా ప్రధాని ట్రూడో చేసిన కామెంట్స్ దుమారానికి కారణమయ్యాయి. బిష్ణోయ్ ముఠా సభ్యులతో భారతీయ ఏజెంట్లు కుమ్మక్కయ్యారని, కెనడాలో ఖలిస్థాని మద్దతుదారులను వీరు లక్ష్యంగా చేసుకున్నారని అక్కడి ప్రభుత్వం ఆరోపించడం సంచలనంగా మారింది. అయితే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని భారత్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.

నిజానికి కెనడా ఖలిస్థానీ వేర్పాటువాదులకు నీడనిస్తోందన్న విమర్శలు ఈనాటివి కావు. దశబ్దాలుగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. కెనడాలో అతిపెద్ద దాడులకు కారణమైన ఖలిస్తానీ ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఇండియా ఏనాటి నుంచో ఆరోపిస్తోంది. 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్-182 బాంబు దాడిలో 329 మంది మరణించారు.  మాంట్రియల్ - లండన్ - ఢిల్లీ - ముంబై మార్గంలో నడిచే విమానం అది. కెనడియన్ సిక్కు ఉగ్రవాదులు అమర్చిన బాంబుతో పేలుడు జరిగి ఘోర ప్రాణనష్టం వాటిల్లింది. 

Also Read: గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

1970లలో చాలా మంది ఇండియన్ సిక్కులు పశ్చిమ కెనడాకు వలస వెళ్లారు. 1980ల నాటికి కెనడా-బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్ చుట్టూ ఉన్న ప్రాంతం భారత్‌ వెలుపల సిక్కు జనాభాకు అతిపెద్ద కేంద్రంగా మారింది. నాటి నుంచి నేటి వరకు ఖలిస్థానీ వేర్పాటు వాదులకు కెనడానే అడ్డా. నేరాలు చేయాలనుకునే వారికి కెనడా ఓ సురక్షిత స్వర్గధామంగా మారిందంటూ భారత్ అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. అటు నిజ్జర్‌ హత్య కేసులో కెనడా ఇప్పటికే ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసింది. ఈ విషయంలోనూ భారత్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. కెనడా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ అనేక సందర్భాల్లో విమర్శించారు.

Also Read:  టీచర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా!

ఇక జూన్ 18, 2023న వాంకోవర్‌లోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా సమీపంలో ఖలీస్థానీ వేర్పాటువాద నేత నిజ్జర్‌పై కొందరు దాడి చేసి హత్య చేశారు. నిజానికి నిజ్జర్‌ పంజాబ్‌-జలంధర్ జిల్లాలోని హర్‌సిఘ్‌పూర్‌కు చెందినవాడు. 1997లో అతను కెనడాకు వెళ్లాడు. అక్కడ సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారాకు వెళ్లక ముందు అతను ప్లంబర్‌గా పనిచేశాడు. భారత్‌ జనాభాలో 2శాతం మాత్రమే ఉన్న మైనారిటీ మతమైన సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్నది నిజ్జర్‌తో పాటు ఖలిస్థానీ మద్దతుదారుల వాదన. ఇటు ఇండియాలో నిషేధిత మిలిటెంట్ గ్రూప్ అయిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్-KTFను నడిపిస్తుంది నిజ్జరే అని ఇండియా అనేక సందర్భాల్లో చెప్పింది. అందుకే భారత్ ప్రభుత్వం ప్రకారం నిజ్జర్ ఓ ఉగ్రవాది.

Also Read: యాదాద్రి లడ్డూ నెయ్యి స్వచ్ఛమైనదా? పరీక్ష రిజల్ట్స్?

నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో అనుమానం వ్యక్తం చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు పెరిగాయి. ట్రూడో వాదనలను భారత్ ప్రభుత్వం అబద్ధంగా అనేకసార్లు కొట్టిపారేసింది. అయితే కెనడా అంతటితో ఆగలేదు. ఈ కేసుకు సంబంధించి ఓ భారతీయ అధికారిని కెనడా బహిష్కరించింది. ఇక అప్పటి నుంచి కెనడా, భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తో భగ్గుమంటోంది. ఇక తాజా పరిణామాలతో పాటు మరోసారి లారెన్స్ బిష్ణోయ్ పేరును కెనడా అధికారులు ఎత్తడం.. భారత్ ప్రభుత్వంతో కలిసి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పని చేస్తుందని చెప్పడం ప్రకంపనలు రేపుతోంది.

Also Read: శ్రీలీల పాత్రలో నేషనల్ క్రష్.. ఫ్యాన్స్ కు పండుగే!

#bharat #canada
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe