కూరగాయల్లో ఎక్కువగా వాడేది టమాటా. కూరకు మంచి రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది టమాటా. టమాటాలో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా ఉంటాయి. టమాటాలలో విటమిన్ ఏ, సీ లు చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటంవల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్, పొటాషియం, విటమిన్ సీ.. బీపీని కంట్రోల్ చేయడంలో, ధమనుల పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. లైకోపీన్ కు కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించే లక్షణాలు ఉంటాయి. అలాగే రోజువారీ ఆహారంలో ఈ టమాటా చేర్చుకోవడం వల్ల.. గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
Watch Video: టమాటాలు ఎక్కువగా ఏం అవుతుందో తెలుసా ?
టమాటా కూరకు మంచి రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా ఉంటాయని.. విటమిన్ ఏ, సీ లు చర్మానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
New Update
Advertisment