Bangladesh: మైనారీటీలపై 88సార్లు దాడులు..బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో వరుసగా మైనారిటీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.  బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పడిపోవడానికి ఇవి కూడా ఒక కారణం అయ్యాయి. ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో  బంగ్లాదేశ్‌లో 88సార్లు మతపరమైన హింసాత్మక సంఘటనలు జరిగాయని చెబుతున్నారు. 

New Update
Bangladesh: మరోసారి భగ్గుమన్న బంగ్లాదేశ్.. 32 మంది మృతి

 బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, హిందువులపై దాడులు జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. షేక్ హసీనా రాజీనామా  తర్వాత  ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు అంగీకరించింది. ఇందులో ఎక్కువగా దాడులు హిందువుల మీదనే జరిగాయని తెలిపింది.  ఈ ఘటనల్లో 70 మందిని అరెస్ట్ చేశామని బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్‌ ప్రెస్‌ కార్యదర్శి షఫీకుల్‌ ఆలమ్‌ ప్రకటించారు. ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయిని చెప్పారు. హిందువులు, మైనరిటీలపై దాడులు మరిన్ని  మరిన్ని ఘటనలు సమీపకాలంలో జరగొచ్చని...అరెస్టులు కూడా ఉండొచ్చని యూనస్ అన్నారు. ఇప్పటికి కేవలం ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో జరిగినవి మాత్రమే చెప్పామని...అక్టోబర్ తర్వాత జరిగిన వాటి గురించి త్వరలోనే వివరాలు చెబుతామని తెలిపారు. 

హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని భారత్‌ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. బంగ్లాదేశ్‌కు తెలియజేశారు. ఇక బంగ్లాదేశ్‌లో ఇద్దరు ఇస్కాన్ గురువులను కూడా అరెస్ట్ చేయడం దాని వల్ల పెద్ద దుమారం చెలరేగడం అందరికీ తెలిసిందే. 

Also Read: HYD: మోహన్‌బాబుకు రాచకొండ సీపీ నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు