USA: మిల్టన్ దెబ్బకు కొట్టుకుపోయిన ఫ్లోరిడా తీర ప్రాంతాలు

భయంకరమైన మిల్టన్ తుఫాను ఫ్లోరిడా తీరప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలుల, వర్షంతో ముంచెత్తింది. టోర్నడోల దెబ్బకు 8 మంది మరణించారు. 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. 

usa
New Update

Milton Hurrican: 

అనుకున్నట్టుగానే మిల్టన్ తుఫాను అమెరికాను అల్లకల్లోలం చేసింది.  టోర్నడోలు సెయింట్ లూసీ కౌంటీని అతలాకుతలం చేశాయి. ఐదుగురు ప్రాణాలు పొట్టనుపెట్టుకున్నాయి. ఇక ఫ్లోరిడాలో సాగర తీరలో ఉన్న నగరాలన్ని తుఫాను ధాటికి విపరీతంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అక్కడి విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో 30 లక్షల మంది అంధకారంలో కూరుకుపోయారు. ఎటుచూసినా నీరుతో ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి తుపాను తీరం దాటింది. కానీ ఇంకా ముప్పు పొంచే ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

 

ఫ్లోరిడాలోని తాంపాలో గంటకు 205 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచాయి. భారీ వర్షం కురిసింది. చాలా ఇళ్ళు నేల మట్టం అయ్యాయి. ఫోర్ట్ మైయర్స్ లో టోర్నడాల దెబ్బకు చెట్లు కూలిపోయాయి. హార్డీ కౌంటీ, హైలాండ్స్‌ కౌంటీ, ఇంకా చాలా ప్రాంతాల్లో 90% మందికి విద్యుత్‌ అంతరాయం కలిగింది. సానిబెల్‌ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. తుపాను ధాటికి చాలా మందే చనిపోయుంటారని...ఎంత నష్టం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని అక్కడి అధికారులు అంటున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల దెబ్బకు ఇళ్ళ పై కప్పులు లేచిపోయాయి. మంచి నీటి సరఫరా ఆగిపయింది. లోఇడాలో విమానాశ్రయాలు మూతబడ్డాయి. హెలెన్ హరికేన్ వేంటనే మిల్టన్ వరుసగా ఫ్లోరిడాను దెబ్బతీశాయి. ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని...ఈదురు గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. 

 

 

Also Read: హెజ్బుల్లా అంతమే టార్గెట్..ఇజ్రాయెల్ నెక్ట్స్ లేపేసేది అతడినే

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe