హెజ్బుల్లా అంతమే టార్గెట్..ఇజ్రాయెల్ నెక్ట్స్ లేపేసేది అతడినే హమాస్, హెజ్బుల్లాలను పూర్తిగా, సమూలంగా నాశనం చేసేవరకూ ఇజ్రాయెల్ యుద్ధం ఆపేది లేదని శపథం చేస్తోంది. ఇందులో భాగంగా హిజ్బుల్లా కోఆర్డినేషన్ టీమ్‌కు అధిపతి అయిన వాఫిక్ సఫా నే తరువాతి టార్గెట్ అని ప్రకటించింది. By Manogna alamuru 11 Oct 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Israel vs Hezbollah: పోరాటం అనివార్యమయ్యాక ప్రాణాలు లెక్కే కాదు.. అరబ్బు దేశాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు చూస్తే ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించక తప్పదు! ఏడాది కాలంగా తన శత్రుదేశాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో మరణిస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముందుగా గాజా గడ్డపై నెత్తుటి ప్రవాహాన్ని సృష్టించిన ఇజ్రాయెల్ దళాలు నెల రోజుల నుంచి లెబనాన్‌లోని హిజ్బుల్లా టార్గెట్‌గా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే లెబనాన్‌లోని టాప్ లీడర్లను హతం చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ ఇక మిగిలిన కొద్ది మంది బడా నేతలపై గురి పెట్టింది. ఇంతకీ ఇజ్రాయెల్ దాడుల్లో నెక్ట్స్ చనిపోయే హిజ్బుల్లా నేత ఎవరు? అసలు ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య గతంలో ఎన్నిసార్లు యుద్ధం జరిగింది? అక్టోబర్ 10 అర్థరాత్రి లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఏడాది కాలంలో ఈ దాడులు అత్యంత ఘోరమైనవి. అక్కడి చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. హిజ్బుల్లా కోఆర్డినేషన్ టీమ్‌కు అధిపతి అయిన వాఫిక్ సఫాను చంపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించింది. ముందుగా ఆయన చనిపోయినట్టు వార్తలు వచ్చినా వాఫిక్ గాయాలతో బయటపడ్డారని రాయిటర్స్ నివేదించింది. హిజ్బుల్లాకు చెందిన అల్ మనార్ TV కూడా ఇజ్రాయెల్ చేసిన హత్యాప్రయత్నం విఫలమైందని ధృవీకరించింది. అయితే ఈ ఘర్షణలో 22 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య ఘర్షణలు 1982 నుంచి ఉన్నాయి. 1982 జూన్‌లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. అప్పటికి ఏడేళ్లుగా లెబనాన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఆ సమయంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్-PLO ఆధీనంలో పశ్చిమ బీరుట్‌ను ఇజ్రాయెల్ దళాలు ముట్టడించాయి. ఆ తర్వాత అక్కడి అంతర్యుద్ధంలో స్థానిక ప్రాక్సీలకు మద్దతునిస్తూ సబ్రా, షటిలా మారణకాండకు సహకరించింది. మితవాద లెబనీస్ మిలీషియా సహకారంతో రెండు రోజుల్లో 3,500 మంది పాలస్తీనియన్ శరణార్థులు, లెబనీస్ పౌరులను నాడు ఇజ్రాయెల్ చంపింది. అక్టోబరు 23, 1983న, రాజధాని బీరుట్‌లోని అనేక భవనాలపై జరిగిన బాంబు దాడిలో 300 మంది ఫ్రెంచ్, అమెరికన్ శాంతి పరిరక్షకులు మరణించారు. ఈ బాంబు దాడిని ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ క్లెయిమ్ చేసింది. ఇది హిజ్బుల్లాతో స్నేహంగా ఉండే సంస్థగా చాలా మంది నమ్ముతారు. ఇక 1992లో లెబనాన్‌లో అంతర్యుద్ధం ముగిసింది. ఆ తర్వాత హిజ్బుల్లా అక్కడి రాజకీయాల్లోకి ప్రవేశించింది. నాడు జరిగిన ఎనికల్లో 128 సీట్లకు ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. ఇక ప్రస్తుతం హిజ్బుల్లాతో పాటు దాని మిత్రపక్షాలకు ఇప్పుడు పార్లమెంటులో 62 సీట్లు ఉన్నాయి. 1993జూలైలో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసింది. దీన్ని ఆపరేషన్ అకౌంటబిలిటీ అని పిలుస్తారు. కొందరు సెవెన్-డే వార్ అని కూడా పిలుస్తారు. ఈ ఈ ఘర్షణలో 118 మంది లెబనీస్ పౌరులు మరణించారు. 500 మంది గాయపడ్డారు. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక 2006 జులైలో మరోసారి లెబనాన్ గడ్డపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ యుద్ధం అప్పుడు 34 రోజుల పాటు కొనసాగింది. దాదాపు 1200 మందిని బలీతీసుకుంది. 4,400 మంది గాయపర్చింది. ఇందులో ఎక్కువగా లెబానన్ పౌరులే ఉన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తమ వైపు 158 మరణించినట్టుగా చెప్పింది. వారిలో ఎక్కువ మంది సైనికులు ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 17న లెబనాన్‌లోని హిజ్బుల్లా కార్యకర్తలకు చెందిన వేలకొద్దీ హ్యాండ్ హెల్డ్ పేజర్‌లు పేలాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు. సుమారు 2,750 మంది గాయపడ్డారు. ఇక సెప్టంబర్ 27న హిజ్బుల్లాలో అత్యంత శక్తివంతమైన నాయకుడు నస్రల్లాను ఇజ్రాయెల్ చంపేసింది. ఇక ఈ నెల రోజుల్లోనే హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన ఏడుగురు ఉన్నత స్థాయి కమాండర్లు, అధికారులు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. ఇక వీరి తర్వాత హిజ్బుల్లా కోఆర్డినేషన్ టీమ్ హెడ్ వాఫిక్ సఫాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్టుగా తాజాగా బీరూట్‌పై జరిగిన దాడి చూస్తే అర్థమవుతోంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి