Pagers : లెబనాన్ లో పేలుళ్లకు కారణమైన హెజ్‌బొల్లా పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్ అపోలో కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన జారీ చేసింది. ఆ పేజర్లు బుడాపెస్ట్ లోని ఓ కంపెనీలో తయారయ్యాయని తెలిపింది. వాటి పై తమ కంపెనీ పేర్లు వాడటానికి మాత్రమే అనుమతి ఇచ్చామని ఆ ప్రకటనలో చెప్పింది.
మా కార్పొరేట్ ఒప్పందం ప్రకారం బీఏసీ కంపెనీ ఉత్పత్తులను కొన్ని ప్రాంతాల్లో విక్రయానికి కేవలం మా ట్రేడ్ మార్క్ ను వినియోగించుకోవడానికి అనుమతించాం. ఆ పేజర్ల డిజైన్, తయారీకి పూర్తిగా బీఏసీదే బాధ్యత అని గోల్డ్ అపోలో తెలిపింది.
కంపెనీ చైరమన్ చింగ్ కుంగ్ మాట్లాడుతూ…గత మూడేళ్ల నుంచి బీఏసీతో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. కానీ సదరు కాంట్రాక్టుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. ఇక ఏఆర్ 924 పేజర్లను చాలా కఠినంగా ఉంటాయంటూ ఆ సంస్థ వెబ్ సైట్ లో ఓ వాణిజ్య ప్రకటన ఉండేది.
కానీ దానిని తాజాగా తొలగించారు. ఈ పేజర్ లో 100 అక్షరాల సందేశాలను కూడా అందుకోవచ్చని గతంలో తెలిపింది. బ్యాటరీ లైఫ్ 85 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. తాజాగా పేజర్ల పేలుళ్లలో లెబనాన్ లో మొత్తం మృతుల సంఖ్య 12 కు చేరింది.
Also Read: Lebanon: లెబనాన్‌లో పేలుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు..వాకీ టాకీలు పేలి 9మంది మరణం