సౌర విద్యుత్‌తో ప్రయాణించగల కారును త్వరలో తీసుకురానున్నట్లు అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ తెలిపింది. శాన్‌డియాగోకు చెందిన అప్లేటా మోటార్స్ సౌర విద్యుత్ కారును అభివృద్ధి చేసింది. మొదటి టెస్టింగ్‌లో పీఐ 2 అనుకూల ఫలితాలను పొందాయి. కారుని బాడీతో అనుసంధానం చేయించి సోలార్ ప్యానెల్‌తో కనెక్ట్ చేస్తారు.
ఇది కూడా చూడండి: Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?
ఒక్కసారి ఛార్జింగ్ పెడితే..
ఈ సోలార్ ప్యానెల్‌తో నడిచే కార్‌లో రోజుకి కనీసం 63 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే ఈ కారు బ్యాటరీతో నడుస్తుంది. ఒక్కసారి దీనికి ఛార్జింగ్ పెడితే దాదాపుగా 1600 కిలోమీటర్లు అంటే వెయ్యి మైళ్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ కారు తర్వాత పరీక్షలకు సిద్ధం అవుతోంది. రెండో దశలో పరీక్షలు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఇక ఈ కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?
ఈ సోలార్ ప్యానెల్ కారు సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏడాది మొత్తంలో దాదాపుగా 11000 మైళ్ల వరకు ప్రయాణించవచ్చు. వీటికి స్ట్రాంగ్ బ్యాటరీలను అమర్చడం వల్ల ఒక్కసారి ఛార్జింగ్ 1600 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీనికి ఛార్జింగ్ పెట్టడానికి ప్లగ్ ఇన్ కూడా చేయక్కర్లేదు. ఆటోమెటిక్‌గా సూర్యరశ్మి ద్వారా ఛార్జ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు అయితే వచ్చే ఏడాది ఈ కారు మార్కెట్లోకి రావచ్చు.
ఇది కూడా చూడండి: Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..
ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానెల్‌లు, ఎండలో ఉన్నంత వరకు బ్యాటరీలను నిరంతరం ఇవి ఛార్జ్ చేస్తూనే ఉంటాయి. టయోటా కూడా గతంలో ఇలాంటి సోలార్ ప్యానెల్‌ను అందించింది. వాహనంలో వీటిని అమలు చేయడానికి సుమారుగా 180 వాట్ల సోలార్ ఛార్జింగ్‌లను లాంఛ్ చేసింది. వీటివల్ల రోజుకి ఇంకా ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
ఇది కూడా చూడండి: Virat Kohli: క్రికెట్ కంటే కోహ్లీకి ఇష్టమైన ఆట ఏంటో తెలుసా?