/rtv/media/media_files/2025/10/20/amazon-web-services-2025-10-20-15-08-38.jpg)
Amazon Web Services
అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతల నుంచి ఏకంగా 15 వేల మంది వినయోగదారులు అమెజాన్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోయారని డౌన్‌డిటెక్టర్ తెలిపింది. భారత కాలమాన ప్రకారం 12.30 PM గంటలకు ఈ అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది. దీంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ క్లౌడ్ సిస్టమ్ ఆధారపడే స్నాప్‌చాట్, రోబ్లేక్స్, డ్యూలింగో లాంటి వెబ్‌సైట్స్ కూడా డౌన్ అయిపోయాయి. ఆ సంస్థ కూడా అంతరాయం ఏర్పడిన విషయాన్ని ధృవీకరించింది. వివిధ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎర్రర్ రేట్స్ పెరిగినట్లు గుర్తించామని పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తున్నట్లు వెల్లడించింది.
🚨AWS Outage Cripples Internet, Disrupting Amazon, Disney+, Coinbase, and More
— Dr. Jeffrey Horelick (@DrJeffHorelick) October 20, 2025
A massive Amazon Web Services (AWS) outage struck the US EAST-1 region on Monday, October 20, starting at 12:11 a.m. PDT, bringing down major websites and apps like Amazon, Disney+, Snapchat,… pic.twitter.com/6IQ388V3xi