AIకి మంత్రి పదవి.. రాజకీయాల్లోకి కొత్త టెక్నాలజీ వచ్చేసిందిగా

అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొదటిసారిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మంత్రిని నియమించింది. ఈ ఏఐ మంత్రి పేరు 'డియెల్లా'. దీనిని అల్బేనియా ప్రధాని ఎడీ రమా తన కొత్త మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ ఏఐ మంత్రి పేరు 'డియెల్లా'.

New Update
AI named Diella

అల్బేనియా ప్రభుత్వం ఇటీవల దేశంలో అవినీతిని అరికట్టేందుకు ఓ వినూత్నమైన, చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రపంచంలోనే మొదటిసారిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మంత్రిని నియమించింది. ఈ ఏఐ మంత్రి పేరు 'డియెల్లా'. దీనిని అల్బేనియా ప్రధాని ఎడీ రమా తన కొత్త మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అల్బేనియాలోని ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (ప్రభుత్వ కొనుగోళ్లు) టెండర్ల కేటాయింపు విభాగాల్లో అవినీతి తీవ్రంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మానవ జోక్యం లేని, పారదర్శకమైన వ్యవస్థ అవసరమని ప్రభుత్వం భావించింది.

డియెల్లాను నియమించడంతో ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో వంద శాతం పారదర్శకత సాధించని వారు భావిస్తున్నారు. ప్రజాధనం కేటాయింపులు, ప్రభుత్వ కొనుగోళ్లలో ఎలాంటి పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు లేకుండా చూడటం. అవినీతిని పూర్తిగా నిర్మూలించి, పరిపాలనా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచాలని చూస్తున్నారు.

డియెల్లా పని ఇదే..

డియెల్లా అనేది ఒక వర్చువల్ అసిస్టెంట్. ఇది అల్బేనియా సంప్రదాయ దుస్తులను ధరించిన మహిళ రూపంలో ఉంటుంది. ఇది ఇప్పటికే e-Albania అనే ప్రభుత్వ సేవల ప్లాట్‌ఫామ్‌లో వర్చువల్ అసిస్టెంట్‌గా సేవలు అందిస్తోంది. ఇప్పుడు, ఈ సాంకేతికతను క్యాబినెట్ మంత్రి హోదాలోకి తీసుకువచ్చి, ప్రభుత్వ టెండర్ల నిర్ణయాధికారాన్ని దశలవారీగా దీనికి అప్పగించనున్నారు. డియెల్లా తన కృత్రిమ మేధస్సుతో డేటాను విశ్లేషించి, టెండర్లను పర్యవేక్షించి, నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రపంచంలో ఈ తరహా నియామకం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగం ద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతి రహిత పాలనకు ఒక కొత్త మార్గాన్ని చూపించాలని భావిస్తోంది. అయితే, ఈ ఏఐ మంత్రి తీసుకునే నిర్ణయాలపై మానవ పర్యవేక్షణ ఎంత వరకు ఉంటుందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఇతర దేశాలకు కూడా ఇది ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు