డొనాల్డ్ ట్రంప్‍పై హష్ మనీ కేసు కొట్టేయాలని విజ్ఞప్తి డొనాల్డ్ ట్రంప్ ను హష్ మనీ కేసు నుంచి తప్పించాలని ఆయన లీగల్ టీం న్యూయార్క్ న్యాయమూర్తి కోరింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి అది అడ్డుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసును కొట్టివేయాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. By K Mohan 04 Dec 2024 | నవీకరించబడింది పై 04 Dec 2024 08:46 IST in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పై ఓ మాయని మచ్చ ఉంది అదే హష్ మనీ కేసు. గతంలో ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో లైంగిక సంబంధాలు పెట్టుకొని.. ఆ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు భారీగా డబ్బు ముట్టజెప్పారు. ఈ డబ్బులు అన్నీ అడ్మినిట్రేషన్ లెక్కలు తప్పుగా చూసించి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. 2023 మేలో మాన్‌హట్టన్ జస్టిస్ జువాన్ మెర్చన్ ఈ కేసులో ట్రంప్ దోషిగా నిర్థారించారు. ఇది కూడా చదవండి : మార్షల్ లా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎత్తివేత.. కారణమేంటి? మొత్తం 34 నేరాలకు ట్రంప్ పాల్పడినట్లు ట్రంప్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్ష పదవి నిర్వహించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు ఫైల్ అయిన వారిలో ట్రంపే మొదటి వ్యక్తి. 2024 డిసెంబర్లో ఆయన రెండోసారి ప్రెసిడెంట్ గా ఎన్నికైయ్యారు. 2025 జనవరి 20న ట్రంప్ ప్రమానస్వీకారం చేసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. తర్వాత ట్రంప్ పాలనకు హుష్ మనీ కేసు అడ్డుగా వస్తుందని, ఈ కేసును కొట్టివేయాలని డిసెంబర్ 3న న్యూయార్క్ రాష్ట్ర న్యాయమూర్తిని కొందరు న్యాయవాదులు కోరారు. ట్రంప్ అధ్యక్ష పదవి అయిపోయే వరకు ఈ కేసులో అన్ని విచారణలను వాయిదా వేయాలని బ్రాగ్ కార్యాలయం సూచించింది. ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు! ట్రంప్ లీగల్ టీం మాత్రం న్యూయార్క్ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతున్నారు. ప్రమాణస్వీకారానికి, ట్రంప్ పాలనకు ఈ కేసు అడ్డుగా ఉందని లాయర్లు వాదించారు. మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్ హుష్ మనీ కేసు ట్రంప్ పై ఉంటే అతని పాలనా సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుందని ఆయన న్యాయవాదులు అన్నారు. #trump #america #newyork మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి