Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. నలుగురు మృతి

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నలుగురు మరణించగా,  60 మందికి పైగా గాయలయ్యాయి. అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం

New Update
BREAKING

BREAKING

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నలుగురు మరణించగా,  60 మందికి పైగా గాయలయ్యాయి. అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం..  మజార్-ఇ-షరీఫ్ నగరానికి సమీపంలోని ఖోల్మ్ ప్రాంతంలో 28 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి అనేక భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం

ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలను విడుదల చేస్తామని ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.కాగా ఆగస్టు 31న తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.  ఈ ఘటనలో 2,200 మందికి పైగా మృతి చెందారు. ఇది జరిగిన రెండు నెలల తర్వాత తాజాగా మరోసారి భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి.  

Advertisment
తాజా కథనాలు