Women's Day 2024 : విమెన్స్ డే వీకెండ్.. ఈ టూరిస్ట్ స్పాట్స్ పై ఓ లుక్కేయండి! రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల కోసమే ఉన్న ఈ ప్రత్యేకమైన రోజును డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. మీ మమ్మితో సేఫ్ అండ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్‌కు వెళ్లవచ్చు. డార్జిలింగ్, జైపూర్, కుఫ్రి, మున్నార్‌కు విజిట్ చేయబచ్చు. మార్చి 9,10 తేదీలు శని, ఆదివారాలని మర్చిపోవద్దు! By Trinath 07 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tourist Destinations : ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మహిళలు(Women's) అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అందులో అతిపెద్ద ఛాలెంజ్ భద్రత. కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణించడం మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రత్యేకించి కొత్త ప్రదేశాల్లో ఉన్నప్పుడు మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు రావొచ్చు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా మీరు మీ తల్లితో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. కుమార్తె, సిస్టర్స్ లేదా స్నేహితులతో కలిసి కూడా వెళ్లవచ్చు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందమైన పర్యాటక ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మహిళలకు ఇది మంచి అవకాశం. కుఫ్రి: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని సిమ్లా సమీపంలో ఉన్న ఒక చిన్న హిల్ స్టేషన్ కుఫ్రి(Hill Station Kufi). ఇక్కడ మీరు అందమైన సరస్సులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, అనేక సుందరమైన దృశ్యాలను చూడవచ్చు. మహిళల భద్రత దృష్ట్యా ఈ ప్రదేశం అద్భుతమైన పర్యాటక ప్రదేశం. మున్నార్: మున్నార్ తేయాకు తోట, ప్రకృతి అందాలు, పచ్చదనాన్నికి ప్రసిద్ధి. మహిళలు ఎలాంటి ఆందోళన లేకుండా ఇక్కడకు వెళ్లవచ్చు. ఒంటరిగా ఉండే మహిళా ప్రయాణికులకు ఇది చక్కటి ప్రదేశం. జైపూర్: భద్రత పరంగా మహిళా ప్రయాణికులకు గొప్ప ప్రదేశం. జైపూర్‌లో హవా మహల్, జల్ మహల్(Jal Mahal), సిటీ ప్యాలెస్, అమెర్ ఫోర్ట్, జంతర్ మంతర్, నహర్‌ఘర్ కోట, జైఘర్ కోట, బిర్లా టెంపుల్, గోవింద్ దేవ్ ఆలయాన్ని సందర్శించవచ్చు. డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ నగరాన్ని మౌంటెన్ క్వీన్ అని పిలుస్తారు. డార్జిలింగ్ ఎల్లప్పుడూ మహిళా ప్రయాణికులకు ఇష్టమైన ప్రదేశం. ఈ చిన్న పట్టణంలో బౌద్ధ విహారాలు, ప్రకృతి సౌందర్యంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. డార్జిలింగ్ టీ తోటలు, పర్వతాలు, దేవాలయాలు, మఠాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. Also Read : వివేక హత్య కేసు.. జగన్ పాత్రపై సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు! #himachal-pradesh #tourist-place #international-womens-day-2024 #travel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి