రోలర్ కోస్టర్ రైడ్ అంటే కొంతమందికి మహా సరదా. ఎత్తు పల్లాల్లో వేగంగా దూసుకుపోయే ఈ రైడ్‌లో ప్రయాణిస్తుంటే ప్రాణం గాల్లో తేలియాడుతూ మహా ఆనందంగా ఉంటుంది.కానీ ఇదే రోలర్ కోస్టర్ రైడ్‌లో ఏదైనా అపశ్రుతి దొర్లితే మాత్రం ప్రమాదం ఊహకు కూడా అందదు అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చాలా అరుదు. కానీ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడే చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.ప్రాణనష్టం కూడా జరుగుతుంది.
లక్కంటే మీదే భయ్యా! అంటూ నెటిజన్ల కామెంట్లు
మన పెద్దవాళ్లు చెప్పినట్టు అదృష్టం బాగుంటే బతికి బట్టకడుతారు అంటారు కదా. అచ్చంగా అలాంటి ప్రమాద అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నారు లండన్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్న పర్యాటకులు. ఈ రోలర్ కోస్టర్ మొదలైనప్పుడు మొదట భూమికి లంబంగా పైకి వెళ్తుంది. ఇక అక్కడి నుండి కిందకి జారుకుంటూ రివ్వున జెట్ స్పీడ్‌లో దూసుకొస్తుంది. కానీ ఇది పైకి వెళ్తున్నప్పుడు భూమికి సుమారు 72 అడుగుల ఎత్తులో సాంకేతిక సమస్యలతో సడెన్‌గా ఆగిపోయింది.
ఇరుక్కుపోయిన మహిళలు, పిల్లలు
ఇందులో ట్రావెల్ చేస్తున్న మహిళా తన ఆరేళ్ళ కుమార్తెతో సహా ఇరుక్కుపోయింది. ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి. పర్యాటకులంతా బిక్కుబిక్కుమంటూ గుటకలు మింగుతూ పైనే అరుస్తూ ఉండిపోయారు. వీరికేదైనా జరగరానిది జరిగి పట్టు తప్పితే మాత్రం అమాంతం కిందకి వచ్చేలోపే వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. అదృష్టవశాత్తు ఆ అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది సమయానికి స్పందించి ఘటనాస్థలానికి చేరుకొని అందులో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా కిందకు దించారు.దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు లక్కంటే మీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.