Chandrayaan-3: ఇదిరా ఇండియా అంటే.. ఇస్రోని ఆకాశానికి ఎత్తేసిన అంతర్జాతీయ మీడియా!

ప్రపంచం మొత్తం ఇస్రోకి సలాం కొడుతోంది. భారత్‌పై కారణం లేకుండా కస్సుబుస్సుమనే కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు సైతం ఇస్రో సాధించిన విజయాన్ని కీర్తించకుండా ఉండలేపోతున్నాయి. అమెరికా, యూకే, అరబ్‌ దేశాల మీడియా సంస్థలు తమ వెబ్‌సైట్స్‌లో బ్యానర్‌ ఐటెమ్‌గా చంద్రయాన్‌-3 విజయం గురించే పెట్టుకున్నాయి. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలి దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది.

New Update
Chandrayaan-3: ఇదిరా ఇండియా అంటే.. ఇస్రోని ఆకాశానికి ఎత్తేసిన అంతర్జాతీయ మీడియా!

International media applauds india's chandrayaan-3 victory: ఇప్పటివరకు ఒక్క లెక్క ఇప్పటి నుంచి ఒక్క లెక్క.. ఇండియా లెవలే మారిపోయింది బాసూ.. చంద్రయాన్‌-3 సాధించిన విజయం గురించి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కీర్తిస్తున్న విధానం చూస్తే కాలర్‌ ఎగురేసుకోకుండా ఉండలేము. యాంటి ఇండియా స్టాండ్‌ తీసుకుంటుందని నిత్యం విమర్శలు ఎదుర్కొనే 'అల్ జజీరా' సైతం తమ వెబ్‌సైట్‌ బ్యానర్‌ ఐటెమ్‌గా చంద్రయాన్‌ సాధించిన విజయం గురించే పోస్ట్ చేసుకున్నదంటే అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇది చాలా మంచి విషయం. సైన్సు పరంగా ఏ దేశం గెలిచినా అందరూ అంగీరించడం స్వాగతించదగ్గ పరిణామం.

వివిధ అంతర్జాతీయ వార్తా సంస్థల్లో వచ్చిన బ్యానర్‌ ఐటెమ్స్‌పై ఓ లుక్కేయండి:

publive-image బీబీసీ

publive-image ARY NEWS(Pakistan)

publive-image అల్ జజీరా (Qatar)

publive-image CNN (America)

publive-image డైయిలీ మెయిల్ (UK)

publive-image DW NEWS (german)

publive-image The Guardian (UK)

publive-image mirror (UK)

publive-image The New york Times (US)

publive-image Sky News (UK)

ఇండియాతో మాములుగా ఉండదు మరి:
చంద్రయాన్‌-3 విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రోపై ప్రసంశల వర్షం కురుస్తోంది. అమెరికా, యూకే, అరబ్‌ దేశాల మీడియా సంస్థలు ఇస్రో సాధించిన విజయాన్ని కొనియాడుతున్నాయి. ఇది స్వాగతించదగ్గ విషయమని.. సైన్స్‌ పరంగా ఏ దేశం అభివృద్ది సాధించినా అది మొత్తం మానవాళికే మంచి జరుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచదేశాల నుంచి ఈ విధమైన స్పారిటివ్‌నెస్‌ని ఇండియా కూడా ఊహించలేదనే చెప్పాలి. ఎందుకంటే అంతరిక్షంలోనూ తమదేశమే ముందుండాలి అగ్రరాజ్యాలు భావిస్తుంటాయి. రేసులో తామే ఫస్ట్ ఉండాలని ప్రయత్నిస్తుంటాయి.. దక్షిణ ధృవంపై ల్యాండర్‌ కాలు మోపడం అంటే చిన్నాచితక విషయం కాదు.. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా.. ఇలా దాదాపు అన్ని దేశాలు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాయి. ఇండియా మాత్రం జాబిల్లి దక్షిణ ధృవంపై సగర్వంగా కాలు మోపింది. వడివడి అడుగులు వేసుకుంటూ రోవర్‌ జాబిల్లి నేలను తాకింది. ఇది ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంతకముందు సాధ్యం కాలేదు. అన్ని రంగాల్లోనూ.. సైన్స్‌లోనూ.. శాస్త్రసాంకేతిర రంగంలోనూ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు సైతం ఇది సాధ్యపడలేదు. ఇస్రో మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులను సృష్టిస్తూ చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని సక్సెస్‌ చేసింది.

Advertisment
తాజా కథనాలు