Inter Exams: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు..

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల కోసం ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20తో ముగియనుంది. రూ.3500 ఫైన్‌కో ఫీజు చెల్లించొచ్చని ఇంటర్‌ బోర్టు డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

AP: విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ రిలీజ్..ఇలా డౌన్ లోడ్  చేసుకోండి..!
New Update

తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల ఫీజుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20తో ముగియనుంది. రూ.3500 ఫైన్‌కో ఫీజు చెల్లించొచ్చని ఇంటర్‌ బోర్టు డైరెక్టర్ శృతి ఓజా తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Also read: వ్యభిచార ముఠా అరెస్టు.. పోలీసుల అదుపులో అఖిల్ పహిల్వాన్

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్టియర్, సెకండియర్‌లకు సంబంధించి 10,59,233 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో అడ్మిషన్లను పొందారు. వీరిలో 8,99,041 మంది విద్యార్థులు నిర్ణీత గడువులోపే పరీక్ష ఫీజులు చెల్లించగా.. ఫీజు చెల్లించని వారి కోసం ఫైన్‌తో కూడిన గడువు విధించారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఫస్టియర్‌ పరీక్షలు 2024 మార్చి 18 ముగియనుండగా.. సెకండియర్‌ పరీక్షలు మార్చి 19న ముగుస్తాయి.

ప్రధాన పరీక్షలు రెండు రోజుల ముందుగానే పూర్తవ్వనున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో కాస్త ముందుగానే ఇంటర్‌ వార్షిక పరీక్షలను నిర్వహించేలా ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి విడుదల చేసింది. పరీక్షలు ఒక రోజు ఫస్టియర్‌ వారికి, మరో రోజు సెకండియర్‌ విద్యార్థులకు ఉంటాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే మూడు గంటల పాటు పరీక్ష సమయం ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించరు.

Also Read: రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి : భట్టి

#telangana-inter-board #inter-exams
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe