Interim Budget 2024 : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..! బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 9వరకు సెషన్ జరుగుతుంది. By Trinath 31 Jan 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Union Budget 2024 : నేటి(జనవరి 31) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Meetings) ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. ఈ సెషన్ మోదీ ప్రభుత్వానికి(Modi Government) రెండోసారి చివరి బడ్జెట్. ఫిబ్రవరి 1న(రేపు) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ మధ్యంతర బడ్జెట్‌పై అందరిచూపు నెలకొంది. ఫిబ్రవరి 9 వరకు ఈ సెషన్ జరగనుంది. ప్రతిపక్షం వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంది. సెషన్‌కు ముందు అఖిలపక్ష సమావేశం: పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశానికి ముందు మంగళవారం(జనవరి 30) అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీలను కేంద్రం ఆహ్వానించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయ సభల అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లైబ్రరీలో ఈ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు, TMC ఎంపీలు సుదీప్ బంద్యోపాధ్యాయ, సుఖేందు శేఖర్ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌లను కలిశారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు ఎండీఎంకే ఎంపీ వైకో హాజరయ్యారు. రాజ్యాంగంలో ఏం ఉంది? భారత రాజ్యాంగం(Indian Constitution) లోని ఆర్టికల్ 112 ప్రకారం, ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తుంది. బడ్జెట్ అనేది ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం, ఖర్చులకు సంబంధించిన పత్రం. ఆర్థిక సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై తర్వాతి ఏడాది మార్చి 31తో ముగుస్తుంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఈసారి మధ్యంతర బడ్జెట్. ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ప్రభుత్వ ఖర్చులకు మాత్రమే సరిపోనుంది. సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను జూలైలో సమర్పిస్తుంది. Also Read: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్ భేటీ! WATCH: #union-budget-2024 #nirmala-sitharaman #interim-budget-2024 #2024-budget-expectations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి