Viral: కింగ్ కోబ్రాతో కోతి సరసాలు.. ఇంటర్నెట్ ను షేక్ చేసిన వీడియో!

కింగ్ కోబ్రా, కోతి మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భయకరంగా బుసలు కొడుతున్న పాము పడగను చేతితో పట్టుకున్న కోతి జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి.

New Update
Viral: కింగ్ కోబ్రాతో కోతి సరసాలు.. ఇంటర్నెట్ ను షేక్ చేసిన వీడియో!

monkey-snake: కింగ్ కోబ్రా, కోతి మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భయంకరమైన బుసలు కొట్టే ఆ పాముతో చూస్తేనే మనకు ఒళ్లు జలదరిస్తుంటే.. కోతి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా దానితో సరసలాడుతూ అందరినీ ఆశ్చ్యపరిచింది. అంతేకాదు తాము ఇద్దరం మంచి స్నేహితులమన్నట్లే వ్యవహరిస్తూ చూపరును మంత్రముగ్దులను చేశాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి.

View this post on Instagram

A post shared by kAshiKyaTrA (@kashikyatra)

రెండు పాములు కోతి దగ్గరకు వచ్చి..
ఈ మేరకు ఓ కోతిని భూ స్వామి బావి దగ్గర కట్టేయగా బండరాయిపై కూర్చొని సేద తీరుతుంది. సరిగ్గా అదే సమయంలో రెండు పాములు కోతి వద్దకు వచ్చాయి. రెండూ పెద్ద పెద్ద పడగలు విప్పి బుసలు కొట్టాయి. కోతి మాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఆలోచనలో నిమగ్నమైంది. దీంతో ఒకపాము కోతికి మరింత దగ్గకు వెళ్లి బుసలు కొట్టింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన కోతి.. 'ఏటి స్నేక్.. నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుంటే కదిలిస్తావెందుకు. పక్కకు వెళ్లి ఆడుకోమ్మ' అన్నట్లు పాము పడగను పట్టకుంది.

ఇది కూడా చదవండి: TS: గురుకుల లెక్చరర్స్ నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు!

పదే పదే బుసలు కొడుతూ..
అయినప్పటికీ పాము బుసలు కొడుదూ కోతి మీదకు వెళ్లింది. కోతి దాని కాటు నుంచి తప్పించుకుంటూ.. పామును పదే పదే కొట్టింది. చివరకు పాము అక్కడి నుంచి పారిపోయింది. పక్కనే పాము మాత్రం కోతి వద్దకు వెళ్లే సాహసం చేయకుండా.. దూరం నుంచి చూస్తూ ఉండిపోతుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'హనుమంతుని ముందు కుప్పిగంతులా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుని ఊహించని రీతిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది.

Advertisment
తాజా కథనాలు