Interesting Facts About Advani's Political Career : లాల్ కృష్ణ అద్వానీ(Advani).. ఈ పేరే ఒక సంచలనం.. బీజేపీ రథ సారధి ఆయన. పార్టీ ఆవిర్భవంలో ఎక్కడో 2 సీట్లకు పరిమితమైన బీజేపీ నేడు దేశాన్ని సంపూర్ణ మెజారిటీతో ఏలుతుందంటే దాని వెనుక ఉన్నది అద్వానీనే. ఎవరైనా మూలాలను మర్చిపోకుడదు.. తాము ఎక్కడ నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి.. అందుకే నేటి బీజేపీ నాటి అద్వానీ సేవలను ఎప్పటికీ మర్చిపోదు. ఇటీవల ఆయన్ను భారతరత్న(Bharata Ratna) తో సత్కరించారు. రాష్ట్రపతి ముర్ము అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు అవార్డును అందించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ అద్వానీతోనే ఉన్నారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) లకు ముందు జరిగిన ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆయన జీవిత విశేషాలను తెలుసుకునేందుకు నేటి తరం ఆసక్తి చూపుతోంది.
ఆర్‌ఎస్‌ఎస్‌కు దగ్గరగా అద్వానీ:
అద్వానీ నవంబర్ 8, 1927న లాహోర్‌లో జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్(Pakistan) లో ఉంది. అద్వానీ తండ్రి పేరు కృష్ణచంద్. తల్లి పేరు జియానీ దేవి. అద్వానీ పాఠశాల విద్య పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగింది. సింధ్‌లోని కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. దేశ విభజన జరిగినప్పుడు ఆయన కుటుంబం ముంబైకి వచ్చింది. ఇక్కడ ఆయన లా అభ్యసించారు. తనదైన ప్రసంగాలతో ఆకట్టుకునే అద్వానీకి మొదట్లో అసలు హిందీ వచ్చేది కాదు. భారత్ వచ్చే వరకు హిందీ మాట్లాడేవారు కాదు. హిందీ సినిమాలు చూడడం ద్వారా భాషను అర్థం చేసుకున్నారట. కొంతకాలం వచ్చిరాని హిందీతోనే నెట్టుకొచ్చారట. భారత్‌కు వలస వచ్చిన తర్వాతే చదవడం, రాయడం నేర్చుకున్నారు అద్వానీ. అద్వానీ తన 14ఏటా 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్‌లో చేరారు. 1977లో జనతా పార్టీలో చేరి, 1980లో బీజేపీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
బీజేపీ(BJP) తో అద్వానీ రాజకీయాల పంథా మార్చారు. ఆధునిక భారతదేశంలో హిందుత్వ రాజకీయాలు అద్వానీతోనే మొదలయ్యాయి. ఆయన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 1989లో రామజన్మభూమి ఉద్యమానికి బీజేపీ అధికారికంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ లాభపడింది. దీంతో బీజేపీ సీట్ల సంఖ్య 2 నుంచి 86 సీట్లకు పెరిగింది.
సెప్టెంబరు 25, 1990న రామమందిర(Ram Mandir) నిర్మాణం కోసం సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రామరథ యాత్ర చేపట్టారు. ఈ రథయాత్రతో హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఆయన పాపులారిటీ గ్రాఫ్ పెరిగింది. అద్వానీ ఇక్కడ హై వోల్టేజ్ ప్రసంగాలు చేశారు. అయితే రథయాత్ర సమయంలో దేశంలోని హిందూ-ముస్లిం సమాజాల మధ్య మత సామరస్య భావన కూడా వృద్ధి చెందింది. నాటి బీహార్ సీఎం లాలూ యాదవ్ అద్వానీ రథయాత్రను ఆపేందుకు ప్లాన్ వేశారు. ఆ సమయంలో అద్వానీని అరెస్టు అయ్యారు.
1991 లోక్‌సభ ఎన్నికల్లో అద్వానీ రథయాత్రతో బీజేపీ లాభపడింది. బీజేపీ సీట్లు 120కి చేరాయి. 1992లో అయోధ్య ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. బీజేపీ ఇప్పుడు బలంగా మారడానికి అనాడు ఆయన వేసిన పునాదులే కారణం. అయోధ్య(Ayodhya) లో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా 1990లో రథయాత్ర చేశారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం నుంచి మహారాష్ట్ర, ఏపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ఈ యాత్ర ప్రభంజనంలా సాగింది. లక్షలాది మంది కార్యకర్తల్లో ఉత్తేజం వచ్చింది. ఆ తర్వాతే బీజేపీ సిద్ధాంతాలు, భావాలు జనాల్లోకి ప్రబలంగా వెళ్లాయి. ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత, రామమందిర నిర్మాణం ఇలా అనేక సంఘటనలు చరిత్రలో లిఖితమయ్యాయి. ఈ చరిత్రకు ప్రధాన కారకుడు అద్వానినే!
ఇది కూడా చదవండి : 76 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్..ఎందుకో తెలుసా?