Nabha Natesh: బలగం హీరోకు నటి వార్నింగ్.. మాటలు జాగ్రత్త, హద్దు దాటొద్దంటూ పోస్ట్!

బలగం హీరో ప్రియదర్శి, నటి నభా నటేశ్ ల మధ్య నెట్టింట మాటల యుద్ధం నడుస్తోంది. ప్రియదర్శి డార్లింగ్ అని పలకరించడంపై నటి అసహనం వ్యక్తం చేసింది. మిస్టర్‌.. కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించింది. దీంతో లైట్‌ తీసుకో డార్లింగ్‌ అంటూ మరోసారి రెచ్చగొట్టాడు హీరో.

New Update
Nabha Natesh: బలగం హీరోకు నటి వార్నింగ్.. మాటలు జాగ్రత్త, హద్దు దాటొద్దంటూ పోస్ట్!

Priyadarshi: బలగం ఫేమ్ ప్రియదర్శి, యంగ్ బ్యూటీ నభా నటేశ్‌ (Nabha Natesh)ల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఇటీవల నభా సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై ఫన్నీగా స్పందించిన ప్రియదర్శి ఆమెను దగ్గరి మనిషిగా సంభోధించాడు. అయితే ప్రయదర్శి పలకరించిన తీరుపై చిరాకు పడిన నభా.. ప్రవర్తన తీరు మార్చుకోవాలంటూ అసహనం వ్యక్తం చేసింది. దీంతో మరోసారి అదే తరహాలో ఆయన రిప్లై ఇవ్వడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభాస్‌ వాయిస్‌తో వీడియో..
ఈ మేరకు నెట్టింట ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే నభా.. ప్రభాస్‌ వాయిస్‌తో ‘హాయ్‌ డార్లింగ్స్‌ ఎలా ఉన్నారు!’ అంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు, ఫ్యాన్స్ రకరకాలుగా స్పందించారు. ఈ క్రమంలోనే నభా టాలెంట్ ను పొగుడుతూ.. ‘వావ్‌ సూపర్‌ డార్లింగ్‌.. కిర్రాక్‌ ఉన్నావు’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ప్రియదర్శి పలకరింపుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘ఐపీసీ సెక్షన్‌ 354A ప్రకారం పరిచయం లేని ఒక మహిళను డార్లింగ్‌ అని పిలవడం లైంగిక వేధింపులతో సమానం’ అని రాసివున్న ఇమేజ్‌ను నెట్టింట పోస్ట్ చేసింది. అంతటితో ఆగడకుండా ‘మిస్టర్‌. కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త’ అంటూ పరోక్షంగా హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: IVF: పుట్టకముందే మరణం.. ఇజ్రాయేల్‌ దాడిలో లక్షలాది పిండాలు, అండాలు ఛిద్రం!

లైట్‌ తీసుకో డార్లింగ్‌..
అయితే దీనిపై మరోసారి స్పందించని ప్రియదర్శి.. ‘మనం పరిచయం లేని వ్యక్తులనే విషయం నాకు తెలియదు. మీరైతే డార్లింగ్‌ అనొచ్చు మేము అంటే మాత్రం సెక్షన్సా? లైట్‌ తీసుకో డార్లింగ్‌’ అంటూ మరోసారి రిప్లై ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా మండిపడిన నటి.. ‘ఆహా!! హద్దు దాటి ప్రవర్తించకు. చూసుకుందాం’ అంటూ మరోసారి అసహనంగా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్, నెటిజన్లు మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది. ఇదంతా ఫేక్. ప్రమోషన్స్ కోసం డ్రామాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు