TS Inter Board: ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరాలనుకునే స్టూడెంట్స్ కు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ మరోసారి గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశ గడువును బోర్డు అధికారులు మరోసారి పొడిగించారు. దీంతో ఆగష్టు 31 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు చేరవచ్చు. అయితే ఇలా జాయినింగ్ డేట్ ను ఇంటర్ బోర్డ్ పొడగించడం రెండో సారి.
దీంతో ఇప్పటి వరకు ఇంటర్ లో చేరలేని విద్యార్థులకు మంచి అవకాశం దక్కింది. ఇక షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఈ నెల 16తోనే లాస్ట్ టైమ్ ఇంటర్ బోర్డ్ ఇచ్చిన గడువు ముగిసింది. అయితే ఆలస్యంగా ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులు మాత్రం లేట్ ఫీజ్ కింద 750 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. గవర్నమెంట్, ప్రభుత్వరంగ సంస్థల కాలేజీల్లో చేరేవారికి మాత్రం ఈ నిబంధనం వర్తించదు. వారు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్..
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ను ఇంటర్ బోర్డు ఏప్రిల్ లో ప్రకటించింది. దీని ప్రకారంగా అక్టోబర్ 10 నుంచి 25 వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయి. ఇక మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి థియరీ పరీక్షలుంటాయి. ఏప్రిల్ 1 నుంచి సమ్మర్ హాలీడేస్ ఉంటాయి.
Also Read: టీఎస్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్..కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ