Wireless Chip In Brain: మనిషి మెదడులో వైర్‌లెస్ చిప్..మరో సంచలనానికి తెర తీసిన ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్...ఈ ఎక్స్ బాస్ మరో సారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి కాంట్రవర్శీలతో కాదు...సంచలనంతో. ప్రపంచంలోనే మొదటిసారి మనిషి మెదడులో వైర్‌లెస్ చిప్ అమర్చారు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్.

New Update
Wireless Chip In Brain: మనిషి మెదడులో వైర్‌లెస్ చిప్..మరో సంచలనానికి తెర తీసిన ఎలాన్ మస్క్

Wireless Brain Chip in Human Brain: కంప్యూటర్‌తో మానవుడు పని చేయడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు కంప్యూటర్‌ని మనిషికి అనుసంధానించే ప్రక్రియ వచ్చేసింది. మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఇందులో ఎలాన్ మస్క్ (Elon Musk) అయితే అందరికన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు. అతని కంపెనీల్లో ఒకటైన న్యూరాలింక్‌లో (Neuralink) మొదటిసారి మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారు. అది విజయవంతంగా జరిగిందని స్వయంగా ఎలాన్ మస్కే తెలిపారు. ఎలక్ట్రానిక్ చిప్ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటుననాడని...ఆరంభ ఫలితాల్లో న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ గుర్తించామని వెల్లడించారు.

Also Read: Divya Deshmukh: నన్ను ఒక సెక్సిస్ట్ గా చూశారు.. భారత చెస్‌ ప్లేయర్‌

బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ ప్రయోగాలకు.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్‌డీఏ గత ఏడాది మే నెలలో ఆమోదం తెలిపింది. న్యారాలింక్  సంస్థ ఇప్పటికే ఇలాంటివి అనేక ప్రయోగాలు కూడా చేసింది. అయితే వీటన్నింటినీ మొదట పందులు, కోతుల మీద చేసింది. వాటి మెదళ్ళల్లో ఎలక్ట్రానిక్ చిప్‌లను అమర్చి అవి విజయవంతంగా పని చేస్తున్నాయి అని కన్ఫార్మ్ చేసుకున్నాకనే మనిషి మీద ప్రయోగించారు. ఈ ఎలక్ట్రానిక్ చిప్ సాయంతో ఒక కోతి పాంగ్‌ అనే వీడియో గేమ్‌ను కూడా ఆడిందని తెలిపారు.

న్యూరాలింక్‌ డెవలప్ చేసిన బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌లో 8 మిల్లీ మీటర్ల వ్యాసం ఉన్న ఎన్‌ 1 అనే చిప్‌ను మెదడులో అమర్చుతారు. వెంట్రుకతో పోలిస్తే 20 వ వంతు మందం మాత్రమే ఉండే సన్నని ఎలక్ట్రోడ్లు ఆ చిప్‌కు ఉంటాయి. ఈ ఎన్‌1 చిప్‌ను (N1 Chip) అమర్చేందుకు పుర్రెలోని చిన్న భాగాన్ని తొలగిస్తారని న్యూరాలింక్ సంస్థ వివరించింది. ఈ చిప్‌కు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఇందులోని ఒక్కో చిప్‌లో 3 వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయని తెలిపింది. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు దగ్గరలో ఉంచుతారు. ఇవి మెత్తగా ఎటైనా వంగేలా ఉంటాయి.

మెదడులోని న్యూరాన్లు, ఈ ఎలక్ట్రోడ్ల మధ్య ప్రసారం అవుతున్న సందేశాలను గుర్తించి ఆ చిప్‌కు పంపుతాయి. ఇక ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయని న్యూరాలింక్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నారు. ఆ చిప్ ఇన్‌స్టాల్‌ అయ్యాక ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్.. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటి పనులు చేస్తుందని తెలిపారు. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది. అయితే న్యూరాలింక్ మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలోనే అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ఈ తరహా చిప్‌ను అమర్చింది. అయితే న్యూరాలింక్ చేసినట్లు తాము పుర్రెలోని కొంత భాగాన్ని తొలగించలేదని సింక్రాన్ వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు