Infosys Narayana Murthy: వారానికి 72 గంటలు పనిచేయాలంటూ ఇటీవల వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. భారతదేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల లోపే ఉండగా చైనా జీడీపీ 19 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, ఆ దేశం అవలంభిస్తున్న నమూనాను అధ్యయనం చేసి మన దేశంలో కూడా అమలు చేయాలని సూచించారు. బెంగళూరులో జరిగిన ఒక సాంకేతిక సదస్సులో పాల్గొన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మనదేశంలోని దాదాపు అన్ని సవాళ్లనూ చైనా కూడా ఎదుర్కొంటోందని, అయినప్పటికీ జీడీపీలో భారత్ కన్నా చాలా రెట్లు ముందుందని నారాయణమూర్తి అన్నారు.
ఇది కూడా చదవండి: బర్రెలక్క ఓట్ల లెక్క తేల్చేసిన సర్వే.. టెన్సన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్
ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న ఉచిత పథకాలు, తాయిలాలపై కూడా నారాయణ మూర్తి అసంతృప్తి వ్యక్తపరిచారు. అయితే, దానిపై వివరణగా కొనసాగింపునిస్తూ.. తాను ఉచితాలకు వ్యతిరేకం కాదని, ఉచితాలు పొందిన వారు దానికి బదులు సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అన్నారు. పేద కుటుంబం నుంచే తాను కూడా పైకి వచ్చానని; ఉచితాలు, రాయితీల లబ్ధిదారులు సామాజిక బాధ్యత నిర్వర్తించాలని నారాయణ మూర్తి సూచించారు.