infosys: ఇన్ఫోసిస్‌ మరో కీలక నిర్ణయం..ఉద్యోగులు ఆ 10 రోజులు..!

మరో అతిపెద్ద కంపెనీ ఇన్ఫోసిస్‌ కూడా ఉద్యోగుల్ని ఆఫీసుకు రమ్మని పిలుపినిచ్చింది. అయితే ఇందులో కూడా ఉద్యోగులకి ఓ వెసులుబాటు కల్పించింది.అది ఏంటంటే ఆఫీసులకు ఉద్యోగుల్ని రమ్మంటునే...నెలలో కనీసం 10 రోజులు వస్తే చాలని ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది

infosys: ఇన్ఫోసిస్‌ మరో కీలక నిర్ణయం..ఉద్యోగులు ఆ 10 రోజులు..!
New Update

కరోనా (covid) తరువాత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మందగించాయి. ఈ క్రమంలో ఐటీ (IT) రంగం బాగా ఇబ్బందులు పడింది. చిన్న కంపెనీలే అనుకుంటే..పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇచ్చి పంపుతున్న సందర్భాలను చూస్తున్నాం. కొన్ని కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడంతో పాటు ..వర్క్‌ ఫ్రం హోం విధానానికి కూడా స్వస్తి పలికాయి.

ఇప్పుడు భారత ఐటీ దిగ్గజ కంపెనీలుకూడా ఒడుదొడుకులు ఎదుర్కుంటున్నాయి. ఏడాది కాలంగా లాభాదాయాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. పెద్ద ప్రాజెక్టులు ఏవీ కూడా కంపెనీలను పలకరించడం లేదు. జీతాలు పెంచకపోగా...ఆఫీసులకు రావాల్సిందే అని స్పష్టం చేసింది.

Also read: వింటర్‌ సీజన్‌ లో వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు

టీసీఎస్‌(TCS)  కూడా ఉద్యోగుల్ని వారంలో 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే అని ఆదేశాలు జారీ చేసేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అతిపెద్ద కంపెనీ ఇన్ఫోసిస్‌(Infosys)  కూడా ఉద్యోగుల్ని ఆఫీసుకు రమ్మని పిలుపినిచ్చింది. అయితే ఇందులో కూడా ఉద్యోగులకి ఓ వెసులుబాటు కల్పించింది.

అది ఏంటంటే ఆఫీసులకు ఉద్యోగుల్ని రమ్మంటునే...నెలలో కనీసం 10 రోజులు వస్తే చాలని ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.ఈ పద్దతి నవంబర్‌ 20 నుంచి అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నుంచి ఎంప్లాయిస్‌కి మెయిల్‌ అందింది. ఉద్యోగుల్ని ఆఫీసుకు రమ్మన్న కంపెనీల్లో విప్రో, క్యాప్‌జెమినీ, ఎల్‌టీఐమైండ్‌ ట్రీ వంటివి ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా వర్క్ ఫ్రం హోం పాలసీకి మెల్లమెల్లగా చరమగీతం పాడుతూ.. ఆఫీసులకు పిలిపించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. టీసీఎస్‌లో అన్ని రోజులు ఆఫీసుకు వెళ్లాలి. ఇక్కడ నెలలో 10 రోజులు వెళ్తే చాలు.

#business #infosys #it-comany
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe