Infinix Zero 30: మీరు సెల్ఫీ ప్రియులా? అయితే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ మీకోసమే..!!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారుదారీ సంస్థ అయిన Infinix త్వరలో నే Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివో (Vivo) ఒప్పో ( Oppo) రియల్ మీ (Realme) ఫోన్ లకు గట్టి పోటీనిస్తుందని ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను బట్టి తెలుస్తోంది.

New Update
Infinix Zero 30: మీరు సెల్ఫీ ప్రియులా? అయితే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ మీకోసమే..!!

Infinix Zero 30 : సెల్ఫీ ప్రియులకు చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇన్ ఫినిక్స్ ( Infinix ) అతి త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కానుంది. కంపెనీ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ ( Infinix Zero 30 5G ) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేస్తుంది. ఈ Infinix స్మార్ట్‌ఫోన్ వివో (Vivo) ఒప్పో( Oppo) స్మార్ట్ ఫోన్ లకు గట్టి పోటీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ నెలాఖరులోగా కంపెనీ Infinix Zero 30 5Gని మార్కెట్లో లాంచ్ చేయగలదని భావిస్తున్నారు. కంపెనీ ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ను 60 డిగ్రీల రౌండ్ డిస్‌ప్లేతో లాంచ్ చేయవచ్చు.

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మరికొన్ని రోజులు వేచి ఉండండి. Infinix ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో బలమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ ఇన్ఫినిక్స్ జీరో 30 5Gని రెండు కలర్ వేరియంట్‌లలో లావెండర్, గోల్డ్ కలర్ వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉందని లీకులను బట్టి తెలుస్తోంది. ఇన్ఫిక్స్ జీర్ 30( infinix Zero 30 ) 5G ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌గా ఉండబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వీవో (Vivo) ఒప్పో,( Oppo) రియల్ మీ ( Realme) లకు గట్టి పోటీనిస్తుందని దీని ఫీచర్లకు సంబంధించి బయటకు వచ్చిన లీక్‌ను బట్టి తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 9GB వరకు వర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేయవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఇన్ఫిక్స్ జీరో 30 5జీ స్పెసిఫికేషన్‌లు:

- ఇన్ఫిక్స్ జీరో 30 5జీ స్మార్ట్‌ఫోన్ 7.9mm స్లిమ్ డిజైన్‌తో విడుదల కానుంది.

-ఈ స్మార్ట్ ఫోన్ వేగన్ లెదర్, గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్‌తో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

-ఇందులో, కంపెనీ 6.78 అంగుళాల 3D కర్వ్డ్ ఎడ్జ్ 60 డిగ్రీల గుండ్రని AMOLED డిస్‌ప్లేను అందించింది.

-డిస్ప్లేలో 950 nits పిక్ బ్రైట్‌నెస్ 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.

-ఈ స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్ తో 9జిబి వర్చువల్ ర్యామ్ కు సపోర్టునిస్తుంది.

-ఈ స్మార్ట్‌ఫోన్ 256జిబి స్టోరేజ్‌తో విడుదల కానుంది.

-ఇన్ఫినిక్స్ జీరో 30 5జీలో కంపెనీ ముందు భాగంలో 50మెగాపిక్సెల్ కెమెరాను అందించింది.

-వినియోగదారులు ఫ్రంట్ కెమెరాతో 60fpsని రికార్డ్ చేసుకునే ఆప్షన్ అందించింది.

-ఇన్ఫిక్స్ జీరో 30 5Gని ఇన్ఫిక్స్ IP53 రేటింగ్‌తో లాంచ్ చేస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు