హైదరాబాద్ లో విషాదం.. ఇండోర్ స్టేడియం గోడ కూలి కార్మికులు మృతి

హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ కూలిపోయింది. 14 మంది గోడకింద చిక్కుకుపోగా 12 మందిని బయటకు తీశారు. ఇద్దరు మరణించారు.

New Update
హైదరాబాద్ లో విషాదం.. ఇండోర్ స్టేడియం గోడ కూలి కార్మికులు మృతి

హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు జరుగుతుండగా సోమవారం మధ్యాహ్నం గోడ కూలిపోయింది. దీంతో నిర్మాణ పనులు చేస్తున్న 14 మంది కూలీలు గోడ కింద చిక్కుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో 12 మందిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరి కూలీలు మృతి చెందినట్లు తెలుపగా.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read : చోరీల్లో సెంచరీ దాటేసిన మహానుభావుడు.. ఎంత దోచేశాడో తెలుసా?

ఈ ప్రమాదంలో చనిపోయిన యువకులను బిహార్‌కు చెందిన బబ్లు, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సునీల్‌గా గుర్తించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో శిథిలాలను తొలిగించిన తర్వాత మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం పనిలోకి ఎంత మంది కార్మికులు వచ్చారు. వారిలో ఎందరు సురిక్షితంగా ఉన్నరనే సమాచారాన్ని నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న వారిని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. నిర్మాణంలో నాణ్యత లేకపోవటం కూలిందా ? లేక డిజైన్ లోపమా? అనేది విచారణ తర్వాత తేలాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు