Telangana : ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ

ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ నెల 11నుంచి పథకాన్ని అమలుచేయాలని భావిస్తోంది ప్రభుత్వం. భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్​లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

New Update
Telangana : ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ

Indiramma Housing Scheme : ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ళ పథకం(Indiramma Housing Scheme) అమలుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government). దీని కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కారు. అర్హులకు 4 దశల్లో ఇందిరమ్మ ఇళ్ళ సొమ్ము చెల్లించాలని నిర్ణయం తీసకుంది.అధికారుల పరిశీలన తర్వాత ఆధార్‌ ఆధారంగా సొమ్ ఖాతాల్లో వేయనుంది. నేరుగా ఇందిరమ్మ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే డబ్బు వస్తుందని చెబుతోంది ప్రభుత్వం.స్థలమున్న వారికి ఇంటి కోసం రూ.5 లక్షల రాయితీ కూడా ఇవ్వనుంది. స్థలం లేనివారికి మాత్రం భూమితో పాటు ఇంటి కోసం అంతే మొత్తం అంటే ఐదు లక్షలు ఇవ్వనుంది. అయితే తొలిదశలో సొంత స్థలం ఉన్న వారితో పథకం ప్రారంభించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. ఈనెల 11న భూమి ఉన్న వారికి డబ్బులు ఖాతాలో జమ చేయనుంది.

గైడ్‌లైన్స్..

ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. దీని ప్రకారం తెలంగాణ(Telangana) లో ఏటా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం జరగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు అవనున్నాయి. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్ల కేటాయింపు చేయనున్నారు. ఇందులో మిగిలిన 33,500 ఇళ్లు రాష్ట్ర రిజర్వు కోటా కింద ఉంటాయి. లబ్ధిదారులకు ఇంటి కోసం నాలుగు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. మొదట బేస్‌మెంట్‌ స్థాయిలో రూ.లక్ష.. రూఫ్‌ స్థాయిలో మరో రూ.లక్ష..పైకప్పు తరవాత రూ.2 లక్షలు.. నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష చొప్పున ఐదు లక్షలు ఇస్తుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేయనుంది.లబ్ధిదారుడికి సొంతంగా లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉండాలి.గ్రామం లేదా పురపాలక పరిధి వారై ఉండాలి. గుడిసె, గడ్డితో పైకప్పు, మట్టి గోడలతో ఇల్లున్నా అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్నా.. వివాహమైనా.. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా..
ఒంటరి- సింగిల్‌ ఉమెన్‌, వితంతు -విడోవర్‌ మహిళలూ లబ్ధిదారులే అని ప్రభుత్వం చెబుతోంది.ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదే మంజూరు చేయబడతాయి.

వితంతు మహిళలకూ..

ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిటే ఇళ్లు ఇస్తారు.ప్రతీ జిల్లాలో ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్‌ ఇంటిని మంజూరు చేస్తారు. గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించి ఖరారు చేస్తారు. కలెక్టర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక జరుగుతుంది.లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డుసభలో ప్రదర్శిస్తారు.400 అడుగుల్లో ఇంటి నిర్మాణం, కిచెన్‌, బాత్రూం ఉండాలి.

సొంత జాగాలు, బిలో పావర్టీ లైన్..

ఇక ఇందిరమ్మ ఇళ్లను తొలి దశలో ప్రధానంగా సొంత జాగాలు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లకు అందించననున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 గజాల ల్యాండ్ ఉండాలని, ఇందులో 400 ఎస్ఎఫ్ టీలో బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేసి ప్రభుత్వానికి అందచేశారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూం తీసుకున్న వాళ్లు దీనికి అనర్హులని అధికారులు చెబుతున్నారు. సొంత జాగా ఉన్న వాళ్ల కు రూ.5 లక్షలను ఒక్కో దశలో రూ.1.25 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేయనున్నారు. ఇక ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీం​కు మొత్తం 82 లక్షల అప్లికేషన్లు రాగా.. గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ లు లబ్ది పొందినవారు 18 లక్షలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు