TS: అడ్డగోలు అప్పులు.. దొంగ ఏడుపులు.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే: ‌ఇందిరాశోభన్

పదేళ్ల కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలు అప్పులు, అసమర్థత, అణిచివేతలు తట్టుకోలేక ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఇప్పడు ఎంపీ సీట్లకోసం దొంగ ఏడుపులతో ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు.

TS: అడ్డగోలు అప్పులు.. దొంగ ఏడుపులు.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే: ‌ఇందిరాశోభన్
New Update

Indira Shoban: అడ్డగోలు అప్పులు, అసమర్థత, అణిచివేతలతో కూడిన పరిపాలన చేసిన కేసీఆర్, పదేండ్లు అధికారంలో ఉండి ప్రజలను ఒక్కనాడు కూడా కలవలేదు. ప్రజలు విసిగిపోయి అధికారం నుంచి దింపేస్తే, ఇప్పుడు గడీల నుంచి బయటకొచ్చి దొంగ ఏడుపు ఏడుస్తూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన దొంగ ఏడుపును నమ్మి ప్రజలు మళ్లీ ఆయనకు ఓట్లేస్తారని భ్రమపడుతున్నాడు. తెలంగాణ ప్రజలను తక్కువగా అంచనా వేస్తూ, వారిని మరోసారి మోసపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

కేసీఆర్ స్టేట్‌మెంట్ తప్పు అని నిరూపించాను..
తన పాలనలో రైతుల ఆత్మహత్యలే జరగలేదని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. జనవరి 28,2023లో మహారాష్ట్ర నాయకులను ఉద్దేశిస్తూ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జీరో అని కేసీఆర్ చెప్పిండు. ఆ రోజే కేసీఆర్ స్టేట్‌మెంట్ తప్పు అని నేను నిరూపించాను. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల గురించిన ఎన్‌సీఆర్‌‌బీ రికార్డులను నాడే నేను బయటపెట్టాను. 2014 నుంచి 2022 వరకూ 6912 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఎన్‌సీఆర్‌‌బీ రికార్డులు ఉన్నాయి. కావాలంటే ఒకసారి ఆయన చెక్ చేసుకోవాలి. రైతులు చనిపోకపోతే రైతు బీమా డబ్బులు ఎందుకు ఇచ్చారు? రైతులు చనిపోలేదంటే ఆ డబ్బులు మీరే నొక్కేశారా? కేసీఆర్ సమాధానం చెప్పాలి.

అలా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు..
లక్ష కోట్ల అప్పు చేసి కాళేశ్వరం కడితే, మూడేండ్లు కూడా గడువకముందే ఓ బ్యారేజీ కుంగిపోయింది. ఇంకో బ్యారేజీ కింది నుంచి నీళ్లు లీక్ అయితున్నయి. వాటిల్లో నీళ్లు స్టోర్ చేస్తే మొత్తం బ్యారేజీలు కొట్టుకుపోతాయని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. మరోవైపు, వానలు లేవు. ఎండలు పెరిగిపోయాయి. దేశమంతటా ఇదే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో పొలాలు ఎండిపోతే, రైతులకు ధైర్యం చెప్పాల్సిందిపోయి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ప్రకృతి వైపరిత్యాన్ని, తన తప్పులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మీద వేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. మేడిగడ్డలో నీళ్లు స్టోర్ చేయొచ్చు అని, ఎత్తిపోయొచ్చు అని చెబుతున్న కేసీఆర్.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు గేట్లు ఎత్తి బ్యారేజీ నుంచి నీళ్లు అన్ని ఎందుకు వదిలేశాడో? నీళ్లు ఎందుకు ఎత్తిపోయలేదో రైతులకు సమాధానం చెప్పాలి.

ఇది కూడా చదవండి: Suryapet: తెలంగాణలో దారుణం.. 9వ తరగతి బాలికను గర్భవతిని చేసి..!

కేసీఆర్ నాశనం చేశారు..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి మంచి నీటి పథకాన్ని కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నాశనం చేశారు. రూ.5 వేల కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది. ఇంటింటికీ నీళ్లు అందేవి. కానీ, అలా చేయకుండా రూ.50 వేల కోట్లు పెట్టి మిషన్ భగీరథ స్కీమ్ తీసుకొచ్చారు. మిషన్ భగీరథ ఓ పెద్ద స్కామ్ అని కాగ్‌ కూడా చెప్పింది. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని కేసీఆర్ అన్నారు. సిగ్గు, శరం లేకుండా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి నీళ్లు ఇవ్వకుండానే ఓట్లు అడిగారు. కేసీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాట అబద్దమే. ఆయన అబద్దాలు అయినా మానేయాలి. లేదంటే తన ఇంటి పేరును కల్వకుంట్లకు బదులు అబద్దాల చంద్రశేఖర్ రావు అని అయినా మార్చుకోవాలి.

అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి..
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. 5 ఎకరాల లోపు రైతులందరికీ రైతుభరోసా చెల్లించారు. రుణమాఫీ, బోనస్, తదితర హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్‌‌ పదేండ్ల పాలనలో రూ.7లక్షల కోట్ల అప్పు చేశారు. ఇప్పుడు ఒక్కొక్క రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రజలు, రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్ మాయ మాటలను నమ్మితే, ఇంకో 7 లక్షల కోట్ల భారాన్ని మన నెత్తిన పెట్టి రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తడు.

ఇందిరాశోభన్ - కాంగ్రెస్ నాయకురాలు

#telangana #kcr #indira-shobhan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి