IndiGo Air Lines : విమాన ప్రయాణికులకు ఇండిగో(IndiGo) విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ రూట్లలో ప్రయాణికుల నుంచి వసూల్ చేస్తున్న ఇంధన చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు ఇండిగో(IndiGo) సంస్థ అధికార ప్రతినిధి గురువారం దీనిపై అధికారిక ప్రకటన చేశారు.
ఇటీవల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలను తగ్గాయి. దీంతో టికెట్లపై ఫ్యూయల్ ధరలను సంస్థ తగ్గిస్తున్నాం.ఇప్పటివరకు ఉన్న ఫ్యూయల్ ఛార్జీలను టికెట్ల నుంచి తొలగిస్తున్నాం. దేశీయంగా, అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే వారినుంచి ఇంధన ధరలను వసూల్ చేయబోము. ఈ రోజు నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
అలాగే అక్టోబర్ లో ఏటీఎఫ్ ధరలు పెరిగినందువల్లే టికెట్లపై ధరలను పెంచాల్సి వచ్చిందని తెలిపింది. ఇప్పుడు ఇందన ధరలు తగ్గడంతో వెంటనే తగ్గించేశామని, తమ సంస్థ ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉందని పేర్కొంది. ఎయిర్ లైన్(Air Line) నిర్వహణ ఖర్చులలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ భాగం అయ్యిందని, అందుకోసమే గతంలో ఛార్జీలను పెంచి ఇప్పుడు తగ్గించామని వివరించింది. అలాగే కేంద్ర తీసుకుంటున్న నిర్ణయంతో తన వినియోగదారులకు సైతం మేలు జరగాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఛార్జీని తొలగించినట్లు తెలిపింది. అయితే, ఏటీఎఫ్ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. కాబట్టి టికెట్ల ధరలనూ అందుకు అనువుగా సవరిస్తామని సంస్థ స్పష్టం చేసింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరిలో 4 శాతం తగ్గించాయి. ఇప్పటి వరకు దిల్లీ(Delhi) లో కిలోలీటరు ధర రూ.1,06,155.67 కాగా, రూ.4162.50 తగ్గించడంతో రూ.1,01,993.17కు చేరింది.
ఇది కూడా చదవండి : Deepika Padukone: నేడు దీపికా పదుకోణె బర్త్ డే.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
ఇక ఈ తగ్గిన ధరలతో దూరాన్ని బట్టి రూ. 300 నుంచి రూ. 1000 వరకూ దగ్గనున్నాయి. సుమారు 500 కిలోమీటర్లకు రూ. 300, 500-1000 కిలో మీటర్లు ప్రయాణిస్తే రూ. 400, వెయ్యి నుంచి పదిహేను వందల దూరానికి రూ.550. మూడు వేల కిలోమీటర్లకు పైనా ప్రయాణిస్తే రూ. 1000గా ఉండనున్నాయి. ఇక ఇండిగో నిర్ణయంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల మేలు కోరే సంస్థలు ఎల్లప్పుడూ సక్సెస్ అవుతాయంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.