Congress MP Shashi Tharoor: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే అమిత్ షా ప్రధాని అవుతారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన రెండు స్టేట్మెంట్స్ ను తాము చూశామని అన్నారు. అందులో ఒకటి 75 ఏళ్లకే అందరూ దిగిపోవాలని ప్రధాని మోదీ పట్టుబట్టినట్లు అమిత్ షా చెప్పడం, ఆ మరుసటి రోజు ప్రధాని మోదీ 2029 వరకు కొనసాగుతారని అమిత్ షా చెప్పడం అనే అంశాలు చూశామని పేర్కొన్నారు. కాగా రెండు స్టేట్మెంట్స్ ప్రస్తుతం హోంమంత్రిగా అమిత్ షా (Amit Shah) చేయడం గమనార్హం అని అన్నారు. అయితే అతను చేసిన రెండు వ్యాఖ్యలలో ఏది నిజమో అమిత్ షానే దేశ ప్రజలకు చెప్పాలి శశిథరూర్ అన్నారు.
ALSO READ: పిఠాపురంలో వంగా గీతకు బిగ్ షాక్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేవనెత్తిన విషయంపై భారత ప్రజలు ఆలోచించాలని అన్నారు. జర్నలిస్ట్ సోదరులు అమిత్ షా ని చెప్పిన రెండు స్టేట్మెంట్స్ లో ఏది వాస్తవమో చెప్పాలని అడగాలని కోరారు. అధికారిక రికార్డుల ప్రకారం సెప్టెంబరు 2025లో ప్రధాని మోదీకి (PM Modi) 75 ఏళ్లు నిండుతాయని అన్నారు. కాగా సెప్టెంబర్ 2025లో ప్రధాని అభ్యర్థిని మార్చబోతున్నారా? లేదా మోదీనే ప్రధానిగా కొనసాగిస్తారా చెప్పాలని బీజేపీ ని ప్రశ్నించారు. అయితే.. బీజేపీకి ఆ అవకాశాన్ని బీజేపీకి ఇవ్వమని భారత్ కు కొత్త ప్రధాని అనే విషయం కోసం సెప్టెంబర్ 2025 వరకు వేచి చూడాల్సిన పని లేదని.. జూన్ 4న భారత దేశానికి కొత్త ప్రధాని వస్తున్నారని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత దేశానికి కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు.