Also Read: ప్రజ్వల్ రేవణ్ణకు షాక్.. ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి
భారత జీడీపీ జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో బలమైన వృద్ధి రేటు సాధిస్తుందని నిపుణులు అంచనా వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) .. జనవరి-మార్చి జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. మరోవైపు 'ఈటీ పోల్' 6.8 శాతం, రాయిటర్స్ పోల్ 6.7 శాతానికి అంచనా వేశాయి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. జనవరి - మార్చి 4వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతం, 2023-24 ఏడాది మొత్తం 8 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. కానీ వీటి అంచనాలకు మించి నాలుగో త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు సాధించడం విశేషం. గత ఆర్థిక ఏడాది 2022-23 వార్షిక ఏడాది 7 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెరిగిన వృద్ధి రేటుతో 2023-24 వార్షిక ఏడాదికి భారత్ 8.2 జీడీపీ వృద్ధి రేటు సాధించినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read: తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు చుక్కలు చూపించిన భార్య..!