GDP: గుడ్న్యూస్.. అంచనాకు మించి జీడీపీ వృద్ధి రేటు సాధించిన భారత్ భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) అంచనాలు మించి మెరుగైన ఫలితాలు సాధించింది. (జనవరి - మార్చి) నాలుగవ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. దీంతో 2023-24 ఏడాది మొత్తం జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతానికి పెరిగింది. By B Aravind 31 May 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి India GDP Growth: భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) అంచనాలు మించి మెరుగైన ఫలితాలు సాధించింది. జనవరి - మార్చి నాలుగవ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. ఈ మేరకు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ డేటాను విడుదల చేసింది. దీంతో 2023 -24 వార్షిక ఏడాది జీడీపీ వృద్ధి రేటు అంచనాకు నుంచి 8.2 శాతానికి పెరిగింది. Also Read: ప్రజ్వల్ రేవణ్ణకు షాక్.. ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి భారత జీడీపీ జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో బలమైన వృద్ధి రేటు సాధిస్తుందని నిపుణులు అంచనా వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) .. జనవరి-మార్చి జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. మరోవైపు 'ఈటీ పోల్' 6.8 శాతం, రాయిటర్స్ పోల్ 6.7 శాతానికి అంచనా వేశాయి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. జనవరి - మార్చి 4వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతం, 2023-24 ఏడాది మొత్తం 8 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. కానీ వీటి అంచనాలకు మించి నాలుగో త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు సాధించడం విశేషం. గత ఆర్థిక ఏడాది 2022-23 వార్షిక ఏడాది 7 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెరిగిన వృద్ధి రేటుతో 2023-24 వార్షిక ఏడాదికి భారత్ 8.2 జీడీపీ వృద్ధి రేటు సాధించినట్లు కేంద్రం వెల్లడించింది. Also Read: తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు చుక్కలు చూపించిన భార్య..! #gdp #india-gdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి