Indian Spidey : స్పైడర్ మ్యాన్ జోడికి బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన పోలీసులు!

'Indianspidey' జోడికి ఊహించని షాక్ తగిలింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ రోడ్డుపై ‘టైటానిక్’ సినిమాలోని స్టంట్స్ చేయడంపై ఢిల్లీ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేసినందుకు భారీ చలాన్ విధించి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

New Update
Indian Spidey : స్పైడర్ మ్యాన్ జోడికి బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన పోలీసులు!

Delhi : సోషల్ మీడియా స్టార్ జోడి Indian Spidey కి ఢిల్లీ పోలీసులు(Delhi Police) షాక్ ఇచ్చారు. ఢిల్లీలోని ద్వారక వీధుల్లో సూపర్‌హీరోల వేశం వేసి స్పైడర్‌మ్యాన్(Spiderman), స్పైడర్ ఉమెన్ దుస్తులు(Spider Women Dresses) ధరించి ఓ జంట బైక్‌పై రీల్స్ చేస్తూ వీడియోలను నెట్టింట షేర్ చేశారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఇవి వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి వెళ్లాయి. ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) బ్రేక్ చేస్తూ ‘టైటానిక్’ సినిమాలోని ఐకానిక్ ఫోజులివ్వడంపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. నడి రోడ్డుపై చేతులు వదిలేసి బైక్ నడపడం, వెనకాల నిలబడి స్టంట్స్ చేయడంపై ఫైర్ అయ్యారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించనందుకు అరెస్ట్ చేశారు.

మోటార్ వెహికల్ యాక్ట్ కింద..
అలాగే ఈ స్పైడర్‌ మ్యాన్ జంట నడిపిన బైకుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతోపాటు బైక్‌పై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం విశేషం. కాగా స్పైడర్ మ్యాన్ ఆదిత్య, అతని స్నేహితురాలు అంజలి స్పైడర్ ఉమెన్ గా.. 'స్పైడర్‌మ్యాన్ నజాఫ్‌గఢ్ పార్ట్ 5' పేరుతో ఈ వీడియోలను రికార్డ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, మోటార్ వెహికల్ యాక్ట్ కింద చలాన్ విధించారు. నజఫ్‌గఢ్‌కు చెందిన అదిత్య సూపర్ హీరో వేషధారణతో బహిరంగంగా ఇటువంటి చర్యను చిత్రీకరించడం ఇదే మొదటిసారి కాకపోగా.. ఇండియన్ స్పైడీ అఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా రన్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు