No Visa To Indian Tourists : భారతీయ పర్యాటకులకు(Indian Tourists) తమ దేశంలో పర్యటించేందుకు ఎలాంటి వీసా అక్కర్లేదంటూ మరో దేశం ముందుకు వచ్చింది. ఇప్పటికే తమ దేశాల్లో పర్యటించేందుకు వీసా లేదని శ్రీలంక(Srilanka), మలేషియా(Malaysia), థాయ్ లాండ్, కెన్యా దేశాలు ప్రకటించగా ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి ఇరాన్(Iran) కూడా వచ్చి చేరింది.
ఈ అవకాశాన్ని భారత్(Bharat), గల్ఫ్(Gulf) తో సహా మరో 33 దేశాల పర్యాటకులకు ఈ అవకాశాన్ని ఇస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడంతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తమ దేశానికి రప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ గవర్నమెంట్ వెల్లడించింది.
శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్ తరువాత ఆ దేశ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి ఈ విషయాన్ని స్వయంగా మీడియాకి తెలిపారు. ఇప్పటికే ఈ దేశానికి వీసా లేకపోయినా రావడానికి తుర్కియే, అజర్‌బైజాన్, ఒమన్, చైనా, అర్మేనియా, లెబనాన్, సిరియా దేశాల పర్యాటకులకు అవకాశం ఉంది.
ఇప్పుడు తాజాగా భారతీయులకు కూడా ఈ అవకాశం లభించింది. దీంతో వీసా అవసరం లేకుండానే ఇరాన్ లో పర్యటించేందుకు భారత్ 45 వ దేశంగా చేరింది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రపంచ దేశాల్లో ఇరాన్ ఫోబియా ప్రచారానికి కూడా స్వస్తి పలకినట్లు అవుతుందని వివరించారు.
ఇప్పుడు తాజాగా భారత్ చేరడంతో ...భారత్, మౌరిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజాస్తాన్, మలేషియా, కాంబోడియా, బ్రెజిల్, పెరూ, క్యూబా, మెక్సికో, వెనిజులా, బోస్నియా, హెర్టెగోవినా, సెర్బియా, క్రొయేషియా , బెలారస్ దేశాలకు వీసా లేకపోయినా తమ దేశంలో పర్యటించేందుకు ఇరాన్ అనుమతిచ్చింది.
కొద్ది రోజుల క్రితమే తమ దేశంలో పర్యటించేందుకు మలేషియా కూడా భారతీయులకు వీసా అవసరం లేదని ప్రకటించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు పెట్టుబడులు పెంచాలనే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశం ఆర్థికంగా బాగుపడాలంటే ముందుగా అభివృద్ధి చెందాల్సింది పర్యాటక రంగమని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వివరించారు. ఇందులో భాగంగానే చైనా, భారత్ పౌరులకు వీసా లేకుండానే మలేషియాలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వీసా లేకుండా తమ దేశంలో 30 రోజులు పాటు ఉండవచ్చని పేర్కొన్నారు. కానీ వీసా సౌలభ్యం అనేది భద్రత ప్రక్రియకు లోబడి ఉంటుందని వివరించారు. భారత్ చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా విషయంలో కొన్ని సడలింపులు కూడా ఉంటాయని గత నెలలోనే ఆ దేశ ప్రధాని ప్రకటించారు.
Also read: గ్యాస్ సిలిండర్ ధరపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్…సిద్ధంగా ఉండండి..!!