Maldives: మాల్దీవుల లొల్లి.. వాళ్లను తిట్టిపోస్తున్న సినీ స్టార్స్

మాల్దీవులకు చెందిన మంత్రి వ్యాఖ్యలపై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం 'ఇండియాను కించపర్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. భారత్ నుంచి మాల్దీవులకు ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. అలాంటిది మీరు మమ్మల్ని అవమానిస్తారా' అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

Maldives: మాల్దీవుల లొల్లి.. వాళ్లను తిట్టిపోస్తున్న సినీ స్టార్స్
New Update

Maldives : మాల్దీవులకు చెందిన మంత్రి మరియం షియునా కాంట్రవర్సియల్ కామెంట్ పై భారతీయులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. భారతీయ కల్చర్, నాయకులను కించపరిచారంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల లక్షదీవులను సందర్శించిన విషయం తెలిసిందే. కాగా ‘ఇండియన్ పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తారు. అక్కడి రోడ్లు సక్రమంగా ఉండవు. ఇదీ.. మీకల్చర్’ అంటూ మోడీని ట్యాగ్ చేస్తూ  మాల్దీవులకు చెందిన మంత్రి మరియం షియునా ట్వీట్ చేశారు. ఇది వైరల్ కావడంతో గొడవ మొదలైంది.

ఇది కూడా చదవండి : Golden Globes : ‘గోల్డెన్‌ గ్లోబ్‌’అవార్డ్స్’.. సంచలనం సృష్టించిన ‘ఓపెన్‌హైమర్’

ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీలు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, నటి పూనమ్ పాండే స్పందించారు.

అక్షయ్ కుమార్ స్పందిస్తూ ‘మాల్దీవులకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ఇండియాను కించపరిచినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. భారత్ నుంచి మాల్దీవులకు ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. మేం టూరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంటే.. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. డిగ్నిటీ ఇంపార్టెంట్’ అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇక నుంచి ఇండియాలోని ఐలాండ్స్‌ను ఎంకరేజ్ చేద్దామంటూ పిలుపునిస్తూ ‘ఎక్స్‌ప్లోర్ ఇండియన్ ఐల్యాండ్’ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. అలాగే సల్మాన్‌ఖాన్ ‘లక్ష్యద్వీప్ లాంటి ద్వీపాన్ని మన దేశ ప్రధాని ఎంతో క్లీన్‌గా ఉంచుతున్నారు. మాల్దీవుల మంత్రి అలా స్పందించడం వెనుక ఉద్దేశమేంటి?’ అని ప్రశ్నించారు.

బాలీవుడ్ నటి పూనమ్ పూనమ్ పాండే ఇక నుంచి మాల్దీవుల్లో షూటింగ్ చేయనంటూ పోస్ట్ చేశారు. 'మాల్దీవులు అంటే నాకు చాలా ఇష్టం. కానీ అక్కడి ఒక ప్రముఖ వ్యక్తి ఇండియా గురించి చులకన చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు. నా నెక్ట్స్ షెడ్యూల్ అక్కడ ఉండటంతో నేను రానని మా టీమ్‌కు కూడా చెప్పేశా. ఇక లక్షద్వీప్‌‌లో షూట్ చేస్తారని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. జనాలు కూడా #BycottMaldives అంటూ పోస్టులు పెడుతున్నారు.

#akshay-kumar #maldives #salmankhan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe