Indian wrestlers: కాంగ్రెస్‌లోకి స్టార్ రెజ్లర్స్.. రాహుల్ గాంధీతో కీలక భేటి!

భారత స్టార్ రెజ్లర్స్ వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.

New Update
Indian wrestlers: కాంగ్రెస్‌లోకి స్టార్ రెజ్లర్స్.. రాహుల్ గాంధీతో కీలక భేటి!

Rahul gandhi: భారత స్టార్ రెజ్లర్స్ వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా కాంగ్రెస్‌లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వినేశ్‌ ఫొగట్‌ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ మంగళవారం లోక్ సభలో రాహుల్ గాంధీతో భేటి మరింత బలాన్ని చేకూర్చింది. ఈ మేరకు మంగళవారం లోక్ సభ వేదికగా వినేశ్, బజరంగ్.. రాహుల్ గాంధీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ను కలిశారు’ అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నాయకులు షేర్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల బరిలోకి..
అయితే వినేశ్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన సోదరి బబిత ఫొగాట్‌పై ఆమెను నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరో రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫోగాట్‌ రాజకీయ ఆరంగేట్రంపై ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ అమ్మాయి రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్‌ వర్సెస్‌ బబితా ఫోగాట్‌ మధ్య పోటీ కూడా ఉండే అవకాశం లేకపోలేదన్నారు. ‘వినేశ్‌ రాజకీయాల్లోకి రానని గతంలో ప్రకటించింది. కానీ పలు రాజకీయ పార్టీలు ఆమెను సంప్రదిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారనేది ఇప్పుడే చెప్పలేం’అంటూ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టు రాధ ఆడియో సంచలనం.. పోలీసులకు ఏం చెప్పిందంటే!

ఇక ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్‌ ఎంపీ దీపిందర్‌ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. వినేశ్‌ను కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు పంపాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో వినేశ్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే వినేశ్ సోదరి బబితా ఫోగాట్.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక హరియాణాలో అక్టోబరు 1వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisment
తాజా కథనాలు