Paris Olympics Air Pistol: పారిస్ ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్ లో మను భాకర్ టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశను పోగొడుతూ, పారిస్‌లో మను భాకర్ బలమైన ప్రదర్శన ఇచ్చింది. మను భాకర్ 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం అంటే ఈరోజు పతకం సాధించే అవకాశం ఉంది. By KVD Varma 28 Jul 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Paris Olympics Air Pistol: పారిస్ ఒలింపిక్స్ లో ఊహించినదే జరిగింది. భారత స్టార్ మహిళా షూటర్ మను భాకర్ (Manu Bhaker) పారిస్‌లో తన సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 22 ఏళ్ల భాకర్ 580 స్కోరు సాధించి క్వాలిఫికేషన్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో షూటర్ వెరోనికా మేజర్ 582 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న రెండో భారత షూటర్ రితమ్ సాంగ్వాన్ 15వ స్థానం సాధించగలిగాడు. భాకర్ టోక్యో నిరాశను తుడిచేసింది.. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన చేసినా దురదృష్ష్టం కారణంగా నిరాశతో వెనుతిరిగింది. పిస్టల్ పనిచేయకపోవడంతో టోక్యోలో ఆమె ముందుకు సాగలేకపోయింది. దీంతో కన్నీళ్ల పర్యంతం అయిన మను.. ఏడుస్తూ బయటకు వచ్చింది. అయితే ఈసారి భాకర్ గట్టి ప్రయత్నం చేసింది. హర్యానాకు చెందిన ఈ షూటర్ మొదటి రెండు సిరీస్‌లలో 97-97 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. Also Read: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత పురుషుల హాకీ జట్టు మూడో సిరీస్‌లో మను సత్తా చాటింది Paris Olympics Air Pistol: భాకర్ 98 స్కోరుతో మూడో సిరీస్‌లో టాప్ 2కి చేరుకుంది. ఐదవ సిరీస్‌లో ఎనిమిది పాయింట్ల లక్ష్యాన్ని చేధించిన ఆమె ఆ తర్వాత ఖచ్చితమైన లక్ష్యాలతో మళ్ళీ ట్రాక్ లోకి రాగలిగింది. చివరికి మూడవ స్థానంలో నిలిచింది. భాకర్ ఇప్పుడు ఆదివారం ఒలింపిక్ పతకాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. నిరాశపరిచిన ఇతర షూటర్లు.. Paris Olympics Air Pistol: అంతకుముందు, ఒలింపిక్ గేమ్స్‌లో ఎయిర్ రైఫిల్‌లో మిక్స్‌డ్ జట్లు నిరాశాజనకంగా ప్రారంభించిన తర్వాత, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సరబ్‌జోత్ సింగ్ - అర్జున్ సింగ్ చీమా ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. సరబ్‌జోత్ మొత్తం స్కోరు 577తో తొమ్మిదో స్థానంలో నిలవగా, అర్జున్ 574 స్కోర్‌తో 18వ స్థానంలో నిలిచాడు. నాల్గవ సిరీస్‌లో ఖచ్చితమైన 100 పాయింట్లు చేసిన తర్వాత సరబ్జోత్ టాప్ 3కి చేరుకున్నాడు, అయితే 22 ఏళ్ల షూటర్ ఆ ఊపును కొనసాగించడంలో విఫలమయ్యాడు. చాలా తక్కువ తేడాతో ఫైనల్స్‌లో చోటు కోల్పోయాడు. చీమా కూడా ఒక్కసారిగా నాలుగో స్థానానికి చేరుకున్నప్పటికీ అతను కూడా ఈ లయను కొనసాగించలేకపోయాడు. గతేడాది హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న భారత జట్టులో చీమా, సరబ్‌జోత్ ఇద్దరూ ఉన్నారు. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ దశలో భారత షూటర్లు ఔట్ అయ్యారు. ఈ ఈవెంట్‌లో భారత్ నుంచి రెండు జంటలు పాల్గొన్నాయి. రమితా జిందాల్ - అర్జున్ బాబుటా మొత్తం 628.7 స్కోరుతో ఆరో స్థానంలో నిలవగా, ఎలవెనిల్ వలరివన్ - సందీప్ సింగ్ మొత్తం 626.3 స్కోరుతో 12వ స్థానంలో నిలిచారు. #manu-bhaker #paris-olympics-2024 #air-pistol-shooting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి