India-Russia: విదేశాల్లో చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్‌కు ఆ దేశం బంపర్ ఆఫర్..

విదేశాల్లో చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్‌కు రష్యా.. తమ దేశంలో స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ప్రకటించింది. 89 ప్రాంతాల్లో 766 రష్యన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు అప్లై చేసుకునే స్టూడెంట్స్‌కు 200 గ్రాంట్ల వరకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

New Update
TS ECET : ఈసెట్‌ ఫలితాల తేదీ ఖరారు..

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చదవాలనుకునే భారత విద్యార్థులకు 'రష్యా' బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లు అందిస్తామని చెప్పింది. ఈ మేరకు చైన్నైలోని రష్యన్ హౌస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్ మా యూనివర్సిటీలు అందించే స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. 89 ప్రాంతాల్లో 766 రష్యన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు అప్లై చేసుకునే స్టూడెంట్స్‌కు 200 గ్రాంట్ల వరకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Also read: అంతరిక్షంలోకి వెళ్లనున్న రోబో పాము.. ఐడియా ఎవరిదో తెలుసా..?

జనరల్ మెడిసన్, న్యూక్లియర్ పవర్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌తో పాటు మరికొన్ని కోర్సుల్లో ఈ స్కాలర్‌షిప్‌లను ప్రకటించారు. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని రష్యన్ హౌస్ పేర్కొంది. ఇందుకోసం.. www.education-in-russia.com వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చని.. ఇందులో పూర్తి వివరాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

Also read: అద్భుతం చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు.. మనిషి ఇమ్యూనిటీ పవర్ వెయిట్ కొలిచేశారు

Advertisment
తాజా కథనాలు