Hyderabad : ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన షేక్‌ మజమ్మిల్‌ అహ్మద్‌(25) శుక్రవారం కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలంటూ బాధితుడి కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను అభ్యర్థించారు.

New Update
Hyderabad : ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి మృతి

Cardiac Arrest : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థులు(Indian Students) ఇటీవల వరుసగా మృతి చెందిన ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్‌(Hyderabad) కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పై చదువుల కోసం కెనడా(Canada) కు వెళ్లిన అతను కార్టియాక్ అరెస్ట్‌(Cardiac Arrest) తో మృతి చెందాడు. అయితే అతడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలంటూ బాధితుడి కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను అభ్యర్థించారు.

Also Read : కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌.. కారణం అదేనా..

వారం రోజులుగా జ్వరం

ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన షేక్‌ మజమ్మిల్‌ అహ్మద్‌(Shaik Muzammil Ahamed) (25).. 2022లో ఉన్నత చదువుల కోసమని కెనడాకు వెళ్లాడు. ఒంటారియోలోని కొనెస్టోగా అనే కళాశాలలో ఐటీ మాస్టర్స్‌ చదువుతున్నాడు. గత వారం రోజుల నుంచే అహ్మద్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే శుక్రవారం కార్డియాక్ అరెస్టుతో మృతి చెందాడు. అనంతరం అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చినట్లు ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అజ్మల్‌ ఉల్లా ఖాన్‌ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

కేంద్రమంత్రికి లేఖ

అహ్మద్‌ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి(Central Minister) కి లేఖ కూడా రాసినట్లు ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఉన్నత చదువుల కోసమని వెళ్లిన.. అహ్మద్‌ అలా మృతి చెందండతో అతడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలాఉండగా.. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి అమెరికాలోని చికాగోలో దాడికి గురయ్యాడు. ఈ నెల ప్రారంభంలో లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్‌ మజాహిర్‌ అలీపై అక్కడ దుండగులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతోనే అలీ వీడియో ద్వారా తనకు జరిగిన దాడిని తెలియజేశాడు. అతడికి సాయం అందిస్తామని చికాగోలో ఉన్న భారత ఎంబసీ హామీ ఇచ్చింది.

Also Read : త్వరలో ఇంటిటి సర్వే.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Advertisment
తాజా కథనాలు