Indian Student: లండన్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం..ఆమె నీతి ఆయోగ్‌ లో కూడా!

బ్రిటన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చెస్తా కొచ్చార్‌ (33) దుర్మరణం చెందింది. ఆమె భారత్‌ లో ఉన్న సమయంలో నీతి ఆయోగ్‌ లో పని చేసేవారు. గతేడాది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకానామిక్స్‌ లో పీహెచ్‌ డీ చేసేందుకు ఆమె యూకే కి వెళ్లారు.

New Update
Indian Student: లండన్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం..ఆమె నీతి ఆయోగ్‌ లో కూడా!

బ్రిటన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చెస్తా కొచ్చార్‌ (33) దుర్మరణం చెందింది. ఆమె భారత్‌ లో ఉన్న సమయంలో నీతి ఆయోగ్‌ లో పని చేసేవారు. గతేడాది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకానామిక్స్‌ లో పీహెచ్‌ డీ చేసేందుకు ఆమె యూకే కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె మార్చి 19న భర్తతో కలిసి సైక్లింగ్‌ చేస్తున్నక్రమంలో చెత్త తరలించే వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.

నీతీ అయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌ కాంత్‌ చెస్తా మరణం గురించి తెలుసుకుని సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులో ఆమె దుర్మరణం చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌ లో చేస్తున్న సమయంలో ఆమె ఎంతో ధైర్యంగా ఉండేవారని ఆయన కితాబిచ్చారు. చెస్తా కొచ్చార్‌ తండ్రి లెఫ్టెనెంట్‌ జనరల్‌ ఎస్సీ కొచ్చర్‌. ఆయన ప్రస్తుతం లండన్‌ లోనే ఉన్నారు.

దీంతో ఆయన కుమార్తె మృతదేహాన్ని భారత్‌ కు తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆమె గతేడాదే లండన్‌ కు వెళ్లారు. అక్కడ ఆర్గనైజేషనల్‌ బిహేవియరల్‌ మేనేజ్‌మెంట్‌ లో పీహెచ్‌ డీ చేస్తున్నారు.

Also read; సీఎం కుమారుడు, కుమార్తెకి తృటిలో తప్పిన ముప్పు.. గర్భగుడిలో చెలరేగిన మంటలు!

Advertisment
తాజా కథనాలు