Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!

ఇక నుంచి రైలు ప్రయాణంలో కన్ఫార్మ్‌ టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవంటుంది రైల్వే శాఖ. వెయింటింగ్‌ టికెట్ తో రైలులో ప్రయాణం చేస్తే జరిమానా తో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటామని రైల్వేశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

Indian Railways Rules :  దేశంలో అతి పెద్ద రవాణావ్యవస్థలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే అని చెప్పవచ్చు. తక్కువ ఖర్చుని దృష్టిలో పెట్టుకొని చాలామంది రైలులోనే ప్రయాణానికి ఆసక్తి చూపుతుంటారు. రైలు ప్రయాణానికి ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు అవకాశం కూడా ఉండడంతో చాలామంది తమ ప్రయాణానికి నెల నుంచి రెండునెలల ముందుగానే టికెట్లను బుక్‌ చేసుకుంటుంటారు.

అయితే, అత్యవసర సమయాల్లో ప్రయాణం కోసం తత్కాల్‌ టికెట్ల (Tatkal Tickets) ను సైతం రైల్వే జారీ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పలువురు టికెట్లు దొరకని సందర్భాల్లో వెయిటింగ్‌ టికెట్‌తోనే స్లీపర్‌, ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తుంటారు. దీంతో టికెట్ కన్ఫార్మ్‌ అయ్యి అందులో ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగుతుండడంతో పాటు భద్రత విషయంలో రైల్వేశాఖకు ఇబ్బందికరంగా మారింది.

తాజాగా ఈ విషయంలో రైల్వేశాఖ (Indian Railways) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్, ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ హెచ్చరించింది. టికెట్‌ కన్ఫర్మ్‌ కాకుండా ఏసీ, స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా రైల్వేశాఖ కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై వెయిటింగ్‌ టికెట్‌తో ప్రయాణం స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణం చూస్తూ దొరికితే రూ.250, ఏసీ కోచ్‌లో ప్రయాణం పట్టుబడితే రూ.440 జరిమానా విధించడంతో పాటు ఆ తర్వాత స్టేషన్‌ నుంచి అమలయ్యే ఛార్జీలను కలిపి వసూలు చేయనున్నారు.

జరిమానా, ఛార్జీలు చెల్లింపులో ఆలస్యమైనా...కట్టకపోయినా... చెల్లించేందుకు సదరు వ్యక్తి నిరాకరించినా రైల్వేచట్టంలోని సెక్షన్‌ 137 ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.

Also read: స్విమ్మింగ్‌ ఫూల్‌లో కరెంట్‌ షాక్‌..16 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు